మెగా 'ఉప్పెన' ఓటీటీ రిలీజ్ పై ఫుల్ క్లారిటీ
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం కాబోతున్న వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా నిలిచి పోయిన విషయం తెల్సిందే. సమ్మర్ నుండే ఉప్పెన సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా అవ్వడం వల్ల ఓటీటీ విడుదలకు మెగా ఫ్యామిలీ నో అన్నట్లుగా తెలుస్తోంది. నిర్మాతలు సైతం పెద్దగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోవడంతో మెల్లగా థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అప్పుడప్పుడు ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఉప్పెన విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ఎంత ఆలస్యం అయినా కూడా థియేటర్లలోనే విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కు అమ్మేయడం జరిగింది. భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ వారు ఉప్పెన కొనుగోలు చేసినప్పటిని సినిమా థియేటర్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుందని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. ఉప్పెన సినిమా ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ లేదని ఈ ఒప్పందంతో క్లారిటీ వచ్చేసింది. అయితే వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా ను మాత్రం ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం అందుతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్ అనుకుంటున్నారట. రకుల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఉప్పెన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.