సన్నిహితులకు 'ప్రీ వెడ్డింగ్' పార్టీ ఇవ్వనున్న ప్రముఖ సింగర్..!!

Update: 2020-12-26 04:30 GMT
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఎప్పటి నుండో రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో పుకార్లు చక్కర్లు కొడుతూ వచ్చాయి. అవి పుకార్లు కాదు నిజమే అని గుర్తుచేస్తూ ఇటీవల తనను నిశ్చితార్థం జరిగిందని సడన్ షాక్ ఇచ్చింది. అంతేగాక  ఆమె ఎంగేజిమెంట్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా సునీత తన పెళ్లి మరింత దగ్గర పడిందని మరో పోస్ట్ తో గుర్తు చేస్తోంది. వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని సునీత వివాహం చేసుకోబోతుంది. అదిగాక తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, రామ్ చాలా మంచివారు.. ఆయనతో తన మిగిలిన జీవితాన్ని పంచుకోబోతున్నానని తెలిపింది.

ఇక రామ్ - సునీతల వివాహం ఈ నెల చివరిలో హైదరాబాద్‌లో జరగనుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు జనవరిలో జరగనున్న ఈ పెళ్ళికి సునీత రామ్ సిద్ధం అవుతున్నారట. ఈ నెల 26న, ఈ జంట వారి స్నేహితులు, సన్నిహితుల కోసం గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ పార్టీ చేయనున్నారు. గచిబౌలిలోని బౌల్డర్ హిల్స్ వద్ద రాత్రి 7:30 గంటలకు పార్టీలో పాల్గొనాలని సునీత, రామ్ ఆహ్వానిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీలో కాక్టెయిల్స్, సంగీతంతో పాటు డాన్స్ ప్రోగ్రాం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పార్టీలో అతిథులతో పాటు రామ్, సునీతలు జంటగా ఆడి పాడతారట. తమ తల్లికి ఒక తోడు కావాలని కోరుకున్న పిల్లల కోసమే సునీత, 43 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి అంగీకరించిందనే విషయం తెలిసిందే.
Tags:    

Similar News