ప్రముఖ నటి ఇంట దొంగతనం

Update: 2020-09-05 08:50 GMT
తమిళ ప్రముఖ నటి గాయత్రి సాయి నాధ్‌ ఇంట్లో దొంగతనం జరిగింది. 111 గ్రాముల బంగారంను దోచుకు పోయారంటూ గాయత్రి చెన్నైలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆమె ఇంట్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ ను పరిశీలించగా ఆ దొంగనతంను ఆ ఇంట్లోనే వర్క్‌ చేస్తున్న నర్స్‌ శివకామి చేసినట్లుగా గుర్తించారు. గత కొంత కాలంగా శివకామి నర్స్‌ గా గాయత్రి సాయి నాధ్‌ తల్లికి సపర్యలు చేస్తుంది. వృద్దురాలు అయిన తన తల్లిని చూసుకునేందుకు నర్స్‌ ను ఏర్పాటు చేసిన గాయత్రికి ఆ నర్స్‌ ఇలా షాక్ ఇచ్చింది.

బంగారం పోయిన విషయాన్ని రాయపేట పోలీసు స్టేషన్‌ లో గాయత్రి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ ఆదారంగా శివకామి దొంగ అంటూ గుర్తించి ఆమె ఎక్కవ దూరం పారిపోకముందే పట్టుకున్నారు. దొంగను అరెస్ట్‌ చేసిన పోలీసులు బంగారంను గాయత్రి సాయినాథ్‌ కు అప్పగించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు చురుకుగా వ్యవహరించి కేసును తొందరగా క్లోజ్‌ చేసినందుకు గాయత్రి వారికి కృతజ్ఞతలు తెలిపింది.
Tags:    

Similar News