సీక్రెట్ చెప్పేసిన అనీల్ రావిపూడి!
అదే ఈవెంట్ వేదికగా నయనతారను ప్రచారంలో భాగం చేయడానికి అసలు కారకుడు అనీల్ అని తేలిపోయింది.;
సినిమా ప్రచారానికి దూరంగా ఉండే లేడీ సూపర్ స్టార్ నయనతారను దర్శకుడు అనీల్ రావిపూడి `ఎమ్ ఎస్ జీ` ప్రచారానికి తీసుకు రావడం ఎంత సంచలనమైందో తెలిసిందే. దశాబ్దంనర కాలంగా నటనకే పరిమితమైన నయనతారను ప్రచారానికి ఎలా ఒప్పించాడంటూ? నెట్టింట పెద్ద ఎత్తున డిబేడ్ సైతం నడించింది. చిరంజీవి కారణంగా అంగీకరించిందా? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. పెద్దాయన మాట కాదనలేక అనీల్ ఒప్పించాడా? లేక నేరుగా చిరంజీవే మాట్లాడి ఒప్పించారా? అని కూడా చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనీల్ ఉద్దేశించి మాట్లాడే వరకూ కూడా చర్చ జరిగింది.
అదే ఈవెంట్ వేదికగా నయనతారను ప్రచారంలో భాగం చేయడానికి అసలు కారకుడు అనీల్ అని తేలిపోయింది. అప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఉండే నయనతారు ఎలా ఒప్పించాడు? పెద్ద సినిమా డైరెక్టర్లనే లైట్ తీసుకుంది. చివరికి పాన్ ఇండియా సినిమా చేసిన అట్లీ వల్ల కూడా కాలేదు. అలాంటింది అనీల్ వల్ల ఎలా సాధ్యమైందని ఇండస్ట్రీ అంతా బుర్ర పీక్కున్నంత పని చేసింది. చివరికి చిరంజీవి కూడా ఆ కిటుకు ఎంటో చెప్పవయ్యా? అంటూ చమత్కరించడం అంతే ఆసక్తికరం. తాజాగా ఆ సీక్రెట్ ఏంటో అనీల్ రివీల్ చేసాడు.
ఒక్కో సినిమాకు ఒక్కో వైబ్ ఉంటుందన్నాడు. ప్రతీ దర్శకుడు హీరో, హీరోయిన్లకు కథ చెబుతాడు. కానీ వాళ్లను మనం ఎలా ట్రీట్ చేసామన్నదే ముఖ్యమన్నాడు. మన ప్రవర్తను బట్టే వాళ్లు కూడా మారుతుంటారన్నాడు.` నేను అందిరితో కలిసిపోతాను. ప్రతీ ఆర్టిస్ట్ ను కంపర్ట్ బుల్ గా చూసుకుంటాను. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా వచ్చి నా భుజంపై చేయి వేసి మాట్లాడుతారు. అంతలా వాళ్లతో కలిసిపోతాను. మనం జెన్యూన్ గా అడిగినప్పుడు మనతో ఉన్న బాండింగ్ ని బట్టి వాళ్లు రియాక్ట్ అవ్వడం ఉంటుందన్నాడు. `మన మాటకి విలువ ఇస్తారా? లేదా? అన్నది అక్కడే తెలుస్తుందన్నాడు.
నయనతార చాలా నిజాయితీగా పని చేస్తారన్నారు. తాను నటించే సినిమాలకు వందశాతం న్యాయం చేస్తారు. సినిమాకు ఇది అవసరం ..దర్శకుడి పనితీరు ఇలా ఉంటుంది? అని ఆమె బలంగా నమ్మినప్పుడు కచ్చితంగా ప్రమోషన్స్ చేస్తారు` అని తెలిపారు. అనీల్ జోవియల్ పర్సన్. ఎవరితోనైనా సరదాగా మాట్లాడే స్వభావం కలవాడు. నలుగురిలో ఇట్టే కలిసిపోతాడు. అతడి వద్ద ఈక్వెషన్స్ ఉండవు. మాట్లాడితే మాట కలుపుతాడు. అనవసరమైన ఫోజు కొట్టడు. చిన్న, పెద్ద అనే తారతమ్యం ఉండదు. చలాకీగా, ఉత్సాహంగా ఉంటాడు. ప్రతిభతో పాటు ఈ లక్షణాలన్నీ అనీల్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే నయనతార సైతం అనీల్ మాట కాదనలేకపోయింది. అదీ సంగతి.