మన శంకర వరప్రసాద్ గారు.. ఫ్యాన్స్ అత్యుత్సాహం..

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;

Update: 2026-01-12 07:30 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూఎస్ఏ ప్రీమియర్స్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. థియేటర్ల వద్ద మెగా అభిమానుల సందడి మామూలుగా లేదు. అయితే ఇదే సమయంలో కొందరు అభిమానులు చేస్తున్న పనులు ఇప్పుడు చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

సినిమాలోని హైలైట్ సీన్స్, ఎలివేషన్లు, కామెడీ బిట్లను తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్ ఫామ్లలో ఈ చిన్న చిన్న క్లిప్పింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఏ సీన్స్ అయితే థియేటర్లో పేలుతాయో, అవే ఇప్పుడు ఆన్‌లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి.

అభిమానంతోనే ఇలా చేస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నప్పటికీ, ఇది ఒక రకంగా పైరసీ కిందకే వస్తుంది. సినిమా చూడని వారు ఈ ముఖ్యమైన సీన్లను ముందే సోషల్ మీడియాలో చూసేయడం వల్ల, వారికి థియేటర్ కు వెళ్లి చూడాలనే ఉత్సాహం తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల బాక్సాఫీస్ వసూళ్లపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని చెప్పవచ్చు.

పైరసీ కాకపోయినా, ఇలా థియేటర్ వీడియోలను షేర్ చేయడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం చేకూరుతుంది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అనేవి కేవలం వెండితెరపై చూస్తేనే ఆ కిక్కు ఉంటుంది. సోషల్ మీడియాలో చిన్న క్లిప్పులుగా చూడటం వల్ల ఆ ఎమోషన్ ఎక్స్ పీరియన్స్ మిస్ అవుతాము. అందుకే ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని సినీ పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు.

చిరంజీవి వంటి పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు సహజమే అయినా, ఈసారి అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యమైన ట్విస్టులు లేదా ఫైట్ సీక్వెన్స్ లు ఇలా బయటకు రావడం వల్ల సినిమా సస్పెన్స్ దెబ్బతింటుంది. ఏదైనా సరే థియేటర్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలి కానీ, ఇలా ఫోన్లలో చూసి ఆనందపడటం సరైన పద్ధతి కాదు.

ఏదేమైనా అభిమానులు తమ హీరోపై ఉన్న ప్రేమని సినిమాని థియేటర్ లో చూసి చూపించాలి. ఇలాంటి వీడియోలను షేర్ చేయకుండా ఉంటేనే చిత్ర పరిశ్రమకు మేలు జరుగుతుంది. 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి మంచి సినిమాను పైరసీ లేదా సోషల్ మీడియా లీకుల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మరికొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఈ విషయంలో ప్రేక్షకులు మారుతారో లేదో చూడాలి.

Tags:    

Similar News