పెళ్లి ఫోటోలు పంచుకున్న సింగర్ స్టెబిన్.. నుపూర్ తో మరుపురాని జ్ఞాపకాలెన్నో!

అలా సింగర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న స్టెబిన్ బెన్ తాజాగా తన ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.;

Update: 2026-01-12 04:02 GMT

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు స్టెబిన్ బెన్. 2021లో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన సినిమా ద్వారా తన మొదటి పాట (థోడా థోడా ప్యార్) పాడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 2021లో ఎక్కువసార్లు ప్రసారం చేయబడిన హిందీ పాటగా ఈ పాట రికార్డ్ సృష్టించింది. తర్వాత ఇమ్రాన్ హష్మీ, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా , అక్షయ్ కుమార్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలకు గాత్ర దానం కూడా చేశారు. ఇకపోతే స్టెబిన్ పాడిన "సాహిబా" పాట స్పాటిఫై ఇండియాలో నెంబర్ వన్ పాటగా నిలవడమే కాకుండా ప్రపంచ టాప్ చార్ట్ లలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ తో పాటు సంగీత్ లో కూడా పాల్గొని ప్రదర్శన ఇచ్చారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా ప్రదర్శనలతో ప్రసిద్ధ వివాహ ప్రదర్శనకారుడిగా కూడా పేరు దక్కించుకున్నారు.




 


అలా సింగర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న స్టెబిన్ బెన్ తాజాగా తన ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి, ప్రముఖ హీరోయిన్ నుపూర్ సనన్. గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ గత ఏడాది డిసెంబర్ ఆఖరి వారంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నుపూర్ అధికారికంగా ప్రకటించింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం ఉదయపూర్ ప్యాలెస్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయింది.




 


ఇకపోతే సాంప్రదాయ క్రిస్టియన్ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలను స్టెబిన్ బెన్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తన భార్య నుపూర్ సనన్ తో కలిసి రొమాంటిక్ ఫోజులిస్తూ ఫోటోలను పంచుకున్నారు. అంతేకాదు పలువురు సెలబ్రిటీలతో గ్రీన్ థీమ్ ఏర్పాటు చేసిన ఈ జంట వారి మధ్యలో చాలా అందంగా ముస్తాబయి నెటిజన్స్ హృదయాలను దోచుకున్నారు. ఇకపోతే ఈ ఫోటోలలో ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.




 


మొత్తానికైతే చాలా రోజులుగా ప్రేమలో ఉన్న వీరు తమ ప్రేమ విషయాన్ని అధికారికం చేసి నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నూతన జంటకు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.




 


నుపూర్ సనన్ విషయానికి వస్తే.. ప్రముఖ నటి కృతి సనం చెల్లెలు ఫిల్హాల్, ఫిల్హాల్ సీజన్ టు మొహబ్బత్ అని మ్యూజిక్ వీడియోలలో తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత ప్రముఖ టీవీ సీరియల్ పాప్ కౌన్? లో నటించి బుల్లితెర ఆడియన్స్ను ఆకట్టుకుంది.తెలుగులో రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం హిందీలో నూరాని చెహ్రా అనే సినిమాలో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది

Tags:    

Similar News