MSG సెట్స్ లో చిరు, వెంకీ.. మామూలు అల్లరి కాదు ఇది!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2026-01-12 05:22 GMT

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమాలో చిరు, వెంకీ ఇద్దరూ తమ నటనతో ప్రేక్షకులను అలరించారు.

ముఖ్యంగా చిరు- వెంకీ మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో ఒకరి పాటకు మరొకరు స్టెప్పులు వేయడం, ఎమ్.ఎమ్.ఎస్ అంటూ సాగే ఫ్లాష్‌ బ్యాక్ సన్నివేశాలు, అదిరిపోద్ది సంక్రాంతి సాంగ్ తో మాస్ ఆడియన్స్ ను కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించారు చిరంజీవి, వెంకటేష్. సినిమా రిలీజ్ అయిన థియేటర్లలో కూడా మెగాస్టార్, విక్టరీ సీన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

అయితే MSG సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి, వెంకటేష్ సెట్స్‌లో ఎలా ఉన్నారో చూపించే ఒక వీడియోను అనిల్ రావిపూడి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్స్‌ లో ఇద్దరూ తమదైన యాక్షన్‌ తో నవ్వులు పూయిస్తూ సందడి చేసిన మూమెంట్స్ అందరినీ ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, తన అనుభవాన్ని ఎంతో ఎమోషనల్‌ గా వివరించారు. "స్టూడెంట్స్ బ్యాక్ బెంచ్‌ లో కూర్చొని అల్లరి చేస్తారు కదా.. అలా చిరు గారు, వెంకీ గారు ఇద్దరు కలిసి పోయి పనిచేశారు. నాకు అసలు జీరో స్ట్రెస్. చాలా హ్యాపీగా వర్క్ చేశాను" అని తెలిపారు. ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పనిచేయడం తన కెరీర్‌ తోపాటు జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభవమని అనిల్ అన్నారు.

"షూటింగ్ సెట్స్‌లో నేను క్లాప్స్ కొట్టా, ఈలలు వేశా. ఇద్దరినీ హగ్ చేసుకున్న సందర్భాలున్నాయి. షూటింగ్ స్పాట్‌లో చిరు గారు, వెంకీ గారితో కలిసి దాదాపు పది రోజులు పనిచేశాను. నా కెరీర్‌ లోనే కాదు, నా జీవితంలో కూడా ఆ పది రోజులు చాలా ప్రత్యేకం. ఆ సమయంలో గడిచిన ప్రతి మూమెంట్, ప్రతి సెకెండ్‌ ను నేను ఎప్పటికీ మర్చిపోలేను" అంటూ అనిల్ రావిపూడి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

చిరంజీవి, వెంకటేష్ లాంటి ఇద్దరు అగ్ర హీరోలు ఎంతో సరదాగా, ఫ్రెండ్లీగా సెట్స్‌ లో పనిచేయడం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. వారి ఎనర్జీ, పాజిటివిటీ వల్ల షూటింగ్ అంతా పండుగ వాతావరణంలో సాగిందని తెలిపారు. మొత్తానికి, మన శంకర వరప్రసాద్ గారు మూవీ ద్వారా ప్రేక్షకులు తెరపై చిరు- వెంకీ సందడి ఆస్వాదిస్తుంటే, స్వీట్ మూమెంట్స్ ను అనిల్ పంచుకున్నారు. ఆ వీడియో చూసిన అభిమానులు ఇదే అసలైన ఎంటర్టైన్మెంట్, ఇద్దరూ మామూలు అల్లరి చేయలేదుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.




Tags:    

Similar News