క్రింజ్ అనే వాళ్ళకు రావిపూడి ఇచ్చిపడేశాడుగా..

అయితే ఆ మూవీ ప్రమోషన్స్ ను అనిల్ రావిపూడి వినూత్నంగా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. అందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.;

Update: 2026-01-12 05:29 GMT

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ మూవీ ప్రమోషన్స్ ను అనిల్ రావిపూడి వినూత్నంగా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. అందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనకు జీవితం, కెరీర్‌ లో అసలైన ఎనర్జీ ఏం ఇస్తుందో మనసుకు హత్తుకునేలా వివరించారు. ముఖ్యంగా రావిపూడి సినిమాలు క్రింజ్ అనే వారికి సింపుల్ గా ఇచ్చిపడేశాడని అర్ధమవుతుంది.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "నాకు ఎనర్జీ ఏది ఇస్తుందంటే.. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి వచ్చే ప్రేమ. మాల్స్‌ కు వెళ్లినా, పబ్లిక్ ఈవెంట్స్‌ కు వెళ్లినా, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లినా.. ఆరేళ్ల చిన్నారి నుంచి 65 ఏళ్ల బామ్మ వరకు అందరూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా పిలిచి మాట్లాడుతున్నారు" అని అన్నారు.

ప్రేక్షకుల స్పందన తనకు ఎంత విలువైనదో చెబుతూ.. "కొంతమంది నా చేయి పట్టుకుని 'నీ సినిమాలు చాలా బాగుంటాయి.. మాకు చాలా ఇష్టం. నీ కొత్త సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాం' అని చెబుతుంటారు. అప్పుడు నాకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. అదే నా జీవితంలో సాధించిన అతి పెద్ద అచీవ్‌మెంట్" అని అనిల్ రావిపూడి తెలిపారు.

తన కెరీర్‌ లో ఎదురయ్యే విమర్శల గురించి కూడా అనిల్ రావిపూడి స్పందించారు. "నా కెరీర్‌ లో చిన్న చిన్న విమర్శలు, చర్చలు ఉండొచ్చు. కానీ అవన్నీ నాకు నార్మల్ విషయాలే. వాటికి నేను పెద్దగా స్పందించను. ఎందుకంటే ప్రజల ప్రేమ ముందు అవన్నీ ఏమాత్రం కాదు. అవన్నీ పూర్తిగా నథింగ్. అదే నాకు అసలైన కిక్ ఇస్తుంది" అని అన్నారు.

హేటర్స్ గురించి ప్రశ్నించగా.. "నన్ను ఇష్టపడని వాళ్ల కోసం నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాతో ఒక్కసారి బయటకు వచ్చి చూడండి. నాకు ఎంత ప్రేమ దొరుకుతుందో మీకే అర్థమవుతుంది. అదే నాకు చాలు" అని ధీమాగా చెప్పారు. ట్రోల్స్‌ కంటే ప్రేక్షకుల ప్రేమకే తాను ఎక్కువ విలువ ఇస్తానని, అదే తన విజయానికి అసలైన కారణమని మరోసారి స్పష్టంగా చెప్పారు అనిల్ రావిపూడి.

అయితే మన శంకర వరప్రసాద్ గారు మూవీపై ఇప్పుడు అంతా రివ్యూస్ ఇస్తున్నారు. అనిల్ తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే ఇచ్చారని. హీరోల శైలికి తగ్గట్టు ఎపిసోడ్లను క్రియేట్ చేయడంలో తన ప్రత్యేకతను మరోసారి చూపించారని చెబుతున్నారు. చిరు కామెడీ టైమింగ్ ను బాగా వాడుకున్నారని, కథతోపాటు కామెడీ విషయంలో కాస్త కసరత్తు చేసి ఉంటే ఇంకా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News