రాజాసాబ్ బాక్సాఫీస్.. అమెరికా లెక్క ఎంత?
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం నిలకడగా రాణిస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.;
సంక్రాంతి రేసులో నిలిచిన రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ కి ముందు మంచి హైప్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుండి మిశ్రమ స్పందన కనిపిస్తున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదు అనేలా వెళుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం నిలకడగా రాణిస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ముఖ్యంగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద 'ది రాజా సాబ్' డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. మేకర్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమా అక్కడ $2.2 మిలియన్ డాలర్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. పండుగ సీజన్ కావడంతో అక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభాస్ క్రేజ్ వల్లే ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. సాధారణంగా మిక్స్ డ్ రియాక్షన్ అందుకున్న సినిమాలు రెండో రోజు నుంచి డ్రాప్ అవుతుంటాయి కానీ రాజా సాబ్ విషయంలో అలా జరగడం లేదు. సంక్రాంతి సెలవులు కావడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు మొగ్గు చూపుతుండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు స్థిరంగా సాగుతున్నాయి.
నార్త్ అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన అన్ని రకాల పాస్‌లను కూడా ఎనేబుల్ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో అక్కడ వసూళ్లు ఇంకా నిలకడగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే $2.2 మిలియన్ డాలర్లు దాటేసిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని వసూళ్లు సాధిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఓవర్సీస్ పంపిణీదారులు కూడా ఈ కలెక్షన్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి 'ది రాజా సాబ్' తన బాక్సాఫీస్ ప్రయాణాన్ని చాలా బ్యాలెన్స్‌డ్‌గా కొనసాగిస్తోంది. మిశ్రమ స్పందన ఉన్నా సరే ప్రభాస్ స్టామినాతో కలెక్షన్స్ ఈ విధంగా వస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇలానే మరికొన్ని రోజులు కొనసాగలి. రాబోయే వీకెండ్‌లో వసూళ్లు ఇంకా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో డార్లింగ్ క్యారెక్టర్ కు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. సంక్రాంతి హడావిడి తరువాత ఈ సినిమా ఫైనల్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.