హీరోయిన్ కు ఈడీ షాక్.. హాజరు కావాలని ఆదేశం!
బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ కు ఈడీ మరోసారి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా.. ఆమెకు సమన్లు జారీచేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించిందని ఆమెపై ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే.. లేటెస్ట్ గా సమన్లు జారీచేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన విచారణలో.. స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి వచ్చేవారం హారజరు కావాలని ఆదేశించింది. కాగా.. యామీ నోటీసులు అందుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
'విక్కీ డోనర్' సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్.. ఆ సినిమా సక్సెస్ తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ చిత్ర విజయంతో ఫుల్ ఫేమ్ సంపాదించిన బాలీవుడ్ నటి యామీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. హృతిక్ రోషన్ తో కలిసి కాబిల్, వరుణ్ ధావన్ తో కలిసి 'బద్లాపూర్' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఓ థ్రిల్లర్ మూవీలో కూడా నడిస్తోంది.
కాగా.. సౌత్ లోనూ పలు చిత్రాల్లో నటించింది యామీ. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం వంటి చిత్రాల్లో నటించిన యామీ.. నితన్ సరసన 'కొరియర్ బాయ్ కల్యాణ్' సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. అటు కన్నడలోనూ 'ఉల్లాస ఉత్సాహ' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంతోనే ఈమె సినీ ప్రయాణం మొదలు కావడం విశేషం.
ఈ బ్యూటీ.. ఈ మధ్యనే బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను వివాహం చేసుకుంది. జూన్ 4వ తేదీన కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీరి పెళ్లి విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాగా.. ఈమె భర్త ఆదిత్య 'ఉరిః ద సర్జికల్ స్ట్రైక్' సినిమా తీశాడు. ప్రస్తతుం విక్కీ కౌశల్ హీరోగా 'ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
కాగా.. ఇటీవల బాలీవుడ్ లో నిర్మితమవుతున్న భారీ చిత్రాలపై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో మేకర్స్ పలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ఈడీ.. పలువురిపై కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులతోపాటు ఇతరులను కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఈ క్రమంలోనే యామీ గౌతమ్ కు సైతం నోటీసులు ఇచ్చింది.