డన్ కిర్క్ అద్భుతం అంటున్నారే!!
ఈ జనరేషన్ ఫిలిం మేకర్స్ క్రిస్టొఫర్ నోలక్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇప్పటివరకూ ఈయన తెరకెక్కించిన చిత్రాలన్నీ విభిన్నమైనవే కాకుండా.. అన్నిటికీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇన్ సోమ్నియా - బ్యాట్ మ్యాన్ బిగిన్స్ - ది డార్క్ నైట్. ఇన్సెప్షన్ - ది డార్క్ నైట్ రైజెస్ - ఇంటర్ స్టెల్లార్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు నోలన్.
ఈ డైరెక్టర్ లేటెస్ట్ మూవీ డన్ కిర్క్ ఇప్పుడు ఇండియాలో కూడా రిలీజ్ అయింది. అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టులతో పాటు.. అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఫ్రాన్స్ ఎవాక్యుయేషన్ థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఐమ్యాక్స్ 65ఎంఎం ఫార్మాట్ తో తెరకెక్కించంతో.. ఈ చిత్రంలో ఉన్న యుద్ధ సన్నివేశాలు.. ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ అనాల్సిందే. ఇప్పటివరకూ సినిమా చరిత్రలో యుద్ధం ఆధారంగా రూపొందిన సినిమాలలో ఇది ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు.
అలాగే నోలన్ తెరకెక్కించిన సినిమాలలో ఇదే బెస్ట్ అని కూడా అనే టాక్ వినిపిస్తోంది. చిరకాలం పాటు ఈ మూవీ చరిత్రలో నిలిచిపోతుందని.. వార్ బేస్డ్ మూవీస్ లో కొత్త బెంచ్ మార్క్ ను డన్ కిర్క్ సెట్ చేసిందని చెబున్నారు. ఫియాన్ వైట్ హీల్డ్, టామ్ గ్లిన్-కార్నీ, జాక్ లోడ్స్.. హారీ స్టైల్ నచించిన ఈ చిత్రం.. కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.