• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు 'దృశ్యం 2' రిలీజ్‌...

తెలుగు 'దృశ్యం 2' రిలీజ్‌ కు ముహూర్తం ఖరారు

By - Tupaki Desk
Update: 2021-04-06 08:32 GMT
మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ దృశ్యం 2 తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. తెలుగు దృశ్యం లో ఎవరైతే నటించారో ఇప్పుడు సీక్వెల్‌ లో కూడా వారే నటిస్తున్నారు. వెంకటేష్‌ మరియు మీనాలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ కేరళలో జరుగుతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. దృశ్యం 2 ఇప్పటికే ఓటీటీలో విడుదల అయ్యి మంచి టాక్‌ తెచ్చుకున్న నేపథ్యంలో మరింత ఎక్కువ ఆలస్యం చేయకూడదు అనే ఉద్దేశ్యంతో దృశ్యం 2 సినిమా ను చాలా స్పీడ్‌ గా పూర్తి చేసే పనిలో మేకర్స్‌ ఉన్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలోనే సినిమా షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మేజర్‌ పార్ట్‌ పూర్తి అవ్వడంతో సినిమా బ్యాలన్స్ షూటింగ్‌ వెంటనే పూర్తి అవ్వనుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

వెంకీ.. మీనాల 'దృశ్యం 2' సినిమా మరీ ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలకు జూన్‌ 20వ తేదీని ఖరారు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. జూన్‌ 20వ తారీకు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. ఆ రోజున దృశ్యం 2 విడుదల చేయడం సరైన నిర్ణయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారట. అందుకే జూన్‌ 20వ తారీకును విడుదల తేదీగా నిర్ణయించి ఒకటి రెండు వారాల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఒక వ్యక్తి తన కుటుంబం కోసం చేసిన సాహసమే దృశ్యం 2. మొదటి దృశ్యంకు ఏమాత్రం తగ్గకుండా రెండవ పార్ట్‌ ఉండబోతుంది. మొదటి పార్ట్‌ కథకు కొనసాగింపుగా రెండవ పార్ట్‌ కొనసాగబోతుందని మలయాళం సినిమా చూసిన వారు చెబుతున్నారు. దృశ్యం 2 మలయాళం డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. అలా కాకుండా థియేటర్లలో విడుదల చేసి ఉంటే వంద కోట్లు వసూళ్లు అయ్యేవంటూ మోహన్‌ లాల్‌ అభిమానులు అంటున్నారు. దృశ్యం 2 తెలుగు మాత్రం థియేటర్లలోనే విడుదల అవ్వబోతుంది. మలయాళంలో దృశ్యం 2 ను రూపొందించిన జీతో జోసెఫ్‌ తెలుగు రీమేక్‌ కు వర్క్‌ చేస్తున్నాడు.
Tags:    
  • Jeethu Joseph 
  • Meena 
  • Drishyam2 
  • Mollywood 
  • Tollywood 
  • Venkatesh 
  • Telugu News 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS