ఈ సమయంలో వర్మ సినిమాలను మోయలేం
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే అద్బుతం అన్నట్లుగా ఉండేది. ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన పలు సినిమాలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి అనడంలో సందేహం లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తెచ్చి పెట్టాయి. అప్పట్లో ఆయన సినిమాలను పంపిణీ చేసేందుకు ఎగ్జిబ్యూట్ చేసేందుకు పోటీ పడేవారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. వర్మ సినిమా అంటే బయ్యర్లు మొహం చాటేస్తున్నారు. ఎగ్జిబ్యూటర్లు దండం పెట్టి మరీ వద్దు అంటున్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నాడు.
మొదటిది కరోనా వైరస్. ఈ సినిమాను థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ఇప్పటికే ప్రకటించాడు. విడుదలకు సిద్దం అయిన ఆ సినిమాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క బయ్యర్ కూడా కనిపించడం లేదు. తక్కువ రేటుకు కూడా కొనుగోలు చేసేందుకు సిద్దంగా లేరు. నిర్మాతలు స్వయంగా విడుదల చేసుకోవాలని భావిస్తుంటే ఎగ్జిబ్యూటర్లు కూడా ఈ సమయంలో వర్మ సినిమాను ప్రదర్శిస్తే కరెంటు బిల్లు మందం కూడా వసూళ్లు రాకపోవచ్చు అంటున్నారు. అసలు 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లను నడపాల్సి ఉంటుంది.
ఇలాంటి సమయంలో వర్మ సినిమా విడుదల అనేది థియేటర్లకు చాలా పెద్ద భారంగా భావిస్తున్నారు. ఆ నష్టం అంతా భరించి నిర్మాతలు సినిమాను విడుదల చేయాలంటే పెట్టిన పెట్టుబడికి ఇంకా కొంత నష్టపోవాల్సి వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వర్మ తన సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేసుకోవడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వర్మ కరోనా వైరస్ మరియు ఆర్జీవీ మిస్సింగ్ సినిమాలు ఎలా వస్తాయనేది చూడాలి.