ఫస్ట్‌ ఇండియన్‌ స్టార్‌... ప్రభాస్‌ హీరోయిన్‌కి రేర్ రికార్డ్‌

స్టార్స్ నుంచి చిన్న సెలబ్రిటీల వరకు ఈ మధ్య కాలంలో అందరూ ఏదో ఒక బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం మనం చూస్తూ ఉంటాం.;

Update: 2026-04-13 06:51 GMT

స్టార్స్ నుంచి చిన్న సెలబ్రిటీల వరకు ఈ మధ్య కాలంలో అందరూ ఏదో ఒక బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం మనం చూస్తూ ఉంటాం. కొన్ని బ్రాండ్స్‌కి అంబాడిసర్‌గా వ్యవహరించాలని కొందరు స్టార్స్ కోరుకుంటారు. ఆ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తే తమకు మరింత గుర్తింపు, గౌరవం లభిస్తుంది అనుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. అలా హాలీవుడ్‌ నుంచి అన్ని వుడ్స్‌ ముద్దుగుమ్మలు కోరుకునేది విక్టోరియాస్‌ సీక్రెట్‌ బ్రాండ్‌. ఈ కంపెనీ ఇన్నర్స్‌, నైట్‌ వేర్‌తో పాటు బ్యూటీ ప్రాడక్ట్స్‌ను సెల్‌ చేస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్‌కి మార్కెట్‌ ఉంది. అందుకే ఈ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది. అందుకే ఈ కంపెనీ కోసం బ్రాండింగ్‌ చేయాలని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు. ఇండియన్‌ స్టార్స్‌కి ఈ అవకాశం ఇప్పటి వరకు రాలేదు.

విక్టోరియా సీక్రెట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా...

ఎట్టకేలకు విక్టోరియా సీక్రెట్‌ బ్రాండ్‌కి ఇండియన్‌ స్టార్‌ సెలబ్రిటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యింది. బాలీవుడ్‌ నుంచి ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, ఆలియా భట్‌ వంటి ఎంతో మంది సీనియర్ అండ్‌ స్టార్‌ బ్యూటీస్‌ ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే కెరీర్‌ ను ఆరంభిస్తున్న హాట్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రికి ఆ ఛాన్స్ దక్కింది. గతంలో ఒకరు ఇద్దరు హీరోయిన్స్‌ ఇన్నర్స్‌ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపించలేదనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ తర్వాత హీరోయిన్స్ చాలా మంది ఆ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించాలని కోరుకున్నారు. కానీ ఏ ఒక్కరికి ఆ ఛాన్స్ రాలేదు. కానీ అనూహ్యంగా త్రిప్తి డిమ్రికి ఆ ఛాన్స్ రావడం ప్రతి ఒక్క బాలీవుడ్‌ సలెబ్రిటీని ఆశ్చర్యంలో ముంచింది అంటూ ఒక మీడియా సంస్థ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది.

యానిమల్‌ సినిమాతో త్రిప్తి డిమ్రి...

ఇండస్ట్రీలో ఈ అమ్మడు అడుగు పెట్టి చాలా ఏళ్లు అయింది. కానీ యానిమల్‌ సినిమాలో కనిపించే వరకు ఈమెను జనాలు గుర్తించలేదు. సందీప్ వంగ తన యానిమల్‌ సినిమాతో ఈమెకు లైఫ్ ఇచ్చాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నతో పోల్చితే ఈమెకే ఎక్కువ గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపుతోనే ఏడాదిలోనే ఏకంగా అరడజను సినిమాలు చేసింది. ఇప్పుడు మళ్లీ సందీప్ వంగ దర్శకత్వంలోనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ప్రభాస్ హీరోగా సందీప్‌ వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్‌ సినిమాలో త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అంతకు ముందు ఈ సినిమా కోసం హీరోయిన్‌గా దీపికా పదుకునేను ఎంపిక చేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో త్రిప్తి డిమ్రి వచ్చి చేరింది. స్పిరిట్‌ సినిమాతో త్రిప్తి పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌గా మారబోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సందీప్ వంగ, ప్రభాస్ మూవీ స్పిరిట్‌లో...

విక్టోరియాస్ సీక్రెట్ బ్రాండ్‌కు మొట్టమొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి డిమ్రి ఎంపిక కావడంతో జాతీయ స్థాయిలో ఈమె గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎవరు ఈ త్రిప్తి డిమ్రి అంటూ ఆన్‌ లైన్‌లో సెర్చ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోడలింగ్‌తో కెరీర్‌ను ఆరంభించిన త్రిప్తి డిమ్రి 2017లో 'పోస్టర్ బాయ్స్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, సిరీస్‌లు చేసింది. యానిమల్‌ సినిమాలో ఎంపిక కావడంతో ఈమె లైఫ్‌ మారిపోయింది. యానిమల్‌ లో ఈమె కనబర్చిన నటన, కనిపించిన తీరు కారణంగానే ఇప్పుడు ఈ అతి పెద్ద బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఎంపిక అయ్యిందని అంటున్నారు. ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో పాటు, అదే సమయంలో విక్టోరియాస్‌ సీక్రెట్‌ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం రావడంతో డబుల్‌ ధమాకా అన్నట్లు ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News