ఎన్టీఆర్ లుక్... ఇది కొనబడలేదు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవర, వార్ సినిమాల ఫలితాల కారణంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెంటనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకే ఏ విషయంలోనూ రాజీ పడకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్ బయట కనిపించిన ప్రతిసారి ఆయన లుక్ విషయమై కొందరు విమర్శలు చేసిన విషయం తెల్సిందే. మరీ ఎన్టీఆర్ బరువు తగ్గి, సన్నగా కావడంతో ఫేస్ లో ఉండే ఆకర్షణ తగ్గిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ కోరిక మేరకు ఎన్టీఆర్ బరువు తగ్గి కొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. సినిమాలో ఎన్టీఆర్ లుక్ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందని మొదటి నుంచి ఆయన సన్నిహితులు, చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్....
తాజాగా మరో స్టిల్‌తో ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ చేశాడు. ప్రశాంత్ నీల్ మూవీ అనగానే భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయనే విషయం తెల్సిందే. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో ఉన్న యాక్షన్ సీన్స్‌ను మించిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఎన్టీఆర్ చేస్తాడని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఆ స్థాయి యాక్షన్ సీన్స్ ఉన్నప్పుడు కచ్చితంగా ఎన్టీఆర్ ఫిజిక్ సైతం అదే స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఎన్టీఆర్ జిమ్ లో రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తూ బాడీ బిల్డ్ చేశాడు. తాజాగా వెనుక నుంచి కండలు చూపిస్తూ తీసుకున్న ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేయడం జరిగింది. ఈ ఫిజిక్ కష్టపడి చేసింది, కొనబడలేదు అంటూ ఫోటోతో పాటు పోస్ట్ ను జత చేయడం జరిగింది. సాధారణంగా హీరోలు సిక్స్ ప్యాక్ చేయడం, బరువు తగ్గడం చేస్తారు. కానీ ఎన్టీఆర్ మాదిరిగా ఈ స్థాయి కండలు పెంచిన హీరో లేడు అంటూ ఆయన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్‌నీల్ మూవీ షూటింగ్....
ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫిజిక్ ఫోటోకు పలువురు సెలబ్రిటీలు సైతం స్పందించారు. హీరో విశ్వక్ సేన్ స్పందిస్తూ అద్భుతం అని కామెంట్ పెట్టాడు. ఫైర్ ఈమోజీతో ఎన్టీఆర్ ఫోటోకు లక్షల మంది కామెంట్స్ చేస్తూ షేర్ చేశారు. ఎన్టీఆర్ ఫోటో షేర్ చేసిన రెండు గంటల్లోనే ఏకంగా ఆరు లక్షల లైక్స్ నమోదు అయ్యాయి. వేలాది మంది కామెంట్స్ చేస్తూ ఎన్టీఆర్ ఫిజిక్ గురించి స్పందించారు. అత్యధిక షేర్‌లు నమోదు అయ్యాయి. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఏంటి అనేది ఈ ఫోటోకు వస్తున్న రియాక్షన్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ ఈ రేంజ్ ఫిజిక్‌తో కనిపించబోతున్నాను అంటూ ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ను జత చేయడంతో అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి ఎన్టీఆర్ గట్టిగా కొట్టబోతున్నాడు అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో NTRNeel మూవీ...
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు ఒకరు ఈ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ మేకింగ్ విషయంలో ఆలస్యం కావడంతో వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే అత్యధిక బడ్జెట్ మూవీగా రూపొందుతున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ గత చిత్రాల ఫలితాల ప్రభావం ఈ సినిమాపై ఏమాత్రం లేదు. ఇప్పటికే ఈ సినిమా భారీ హైప్ ను క్రియేట్ చేయడంతో, బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఇలా కనిపించడంతో అభిమానులు ఆగలేక పూనకాలతో రెచ్చి పోతున్నారు. ఒక్క అప్‌డేట్ ఇవ్వన్నా అంటూ ఎన్టీఆర్‌ను సినిమా అప్డేట్ కోసం కోరుతున్నారు.