ఇంకొక్కడు తో మరోసారి ఆ స్టార్ హీరో!
ఈ నేపథ్యంలో తాజాగా 66వ చిత్రం కూడా బయటకు వచ్చేసింది. మరోసారి చియాన్ మార్కు ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.;
చియాన్ విక్రమ్ కు సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. `తంగలాన్`, `వీర ధీర శూరన్` లాంటి చిత్రాలు విడుదలైనా? అవి విక్రమ్ రేంజ్ హిట్ ను అందుకోలేదు. దీంతో సౌత్ మార్కెట్ ను శాశించే సరైన హిట్ం ఎప్పుడు పడుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వరుస పెట్టి ప్రాజెక్ట్ లు ప్రకటి స్తున్నారు. చియాన్ 63, 64, 65 అంటూ మూడు చిత్రాలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా 66వ చిత్రం కూడా బయటకు వచ్చేసింది. మరోసారి చియాన్ మార్కు ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
గతంలో తనకు `ఇంకొక్కడు` లాంటి భారీ విజయాన్ని అందించిన దర్శకుడు ఆనంద్ శంకర్‌తో విక్రమ్ రెండోసారి చేతులు కలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం `ఇంకొక్కడు` బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులో పెద్దగా కనెక్ట్ కాలేదు కానీ తమిళ్ లో బాగానే ఆడిందీ చిత్రం. విక్రమ్ లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రమిది. ఈ నేపత్యంలో మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కుతుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఆనంద్ శంకర్ కూడా గత ఐదేళ్లుగా మెగాఫోన్ పట్టలేదు.
2021లో విడుదలైన `ఎనిమీ` తర్వాత ఆనంద్ సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఈ ఐదేళ్ల గ్యాప్‌లో ఆయన విక్రమ్ ఇమేజ్‌కు సరిపోయే ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆనంద్ శంకర్ సినిమాలు స్టైలిష్ యాక్షన్ , టెక్నికల్ వండర్స్ లా నిలుస్తుంటాయి.ఈ నేపథ్యంలో విక్రమ్ కోసం కొత్త కథను మరింత పకడ్బందీగా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. విక్రమ్ సినిమాలంటేనే విభిన్నమైన గెటప్స్, మేకప్ ప్రయోగాలు ఉంటాయి. `ఇంకొక్కడు`లో లవ్ అనే ట్రాన్స్‌జెండర్ విలన్ పాత్రతో విక్రమ్ ప్రేక్షకులను ఎంతగా మెప్పించారో తెలిసిందే.
తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోయే రెండో సినిమాలో కూడా విక్రమ్ తన బాడీ లాంగ్వేజ్‌ను, లుక్‌ను పూర్తిగా మార్చుకుని ఓ వినూత్నమైన పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. ఆనంద్ శంకర్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు ఊహించని ట్విస్టులు ఇవ్వడంలో దిట్ట. సన్నివేశాన్ని ఎంతో స్టైలిష్ గా డిజైన్ చేస్తుంటాడు.ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో పాన్-ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రాజెక్ట్ కూడా భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనుంది. ఒక స్టార్ హీరో -ఒక విజనరీ దర్శకుడు ఐదేళ్ల తర్వాత కలుస్తున్నప్పుడు వారి నుండి వచ్చే అవుట్‌పుట్ మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.