నాని మూవీ రిలీజ్ మళ్లీ వాయిదా పడుతుందా? ఇండస్ట్రీలో చర్చ

అసలు ఈ సినిమా లేట్ అయితే నాని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు చూద్దాం..;

Update: 2026-04-13 07:30 GMT

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' విడుదల తేదీపై గత కొద్దిరోజులుగా ఫిల్మ్ నగర్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మార్చి నుంచి ఆగస్టుకు వాయిదా పడిన ఈ సినిమా, మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. హీరోయిన్ కయదు లోహర్ బర్త్ డే పోస్టర్‌లో డేట్‌ను కన్ఫర్మ్ చేసినప్పటికీ, ఇండస్ట్రీలో మాత్రం గుసగుసలు ఆగడం లేదు. అసలు ఈ సినిమా లేట్ అయితే నాని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు చూద్దాం..

పోస్టర్‌లో క్లారిటీ ఉన్నా.. అనుమానాలు ఎందుకు?:

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ప్యారడైజ్' సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 21న విడుదల చేయాలని నాని గట్టి పట్టుదలతో ఉన్నారు. నిన్న విడుదలైన హీరోయిన్ పోస్టర్‌లో కూడా ఇదే తేదీని మరోసారి ముద్రించారు. అయితే, గతంలో కూడా ఇలాగే చెప్పి వాయిదా వేయడంతో, కేవలం పోస్టర్లను చూసి మాట మీద ఉంటారని గ్యారెంటీ లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికైతే డేట్ మారలేదని క్లారిటీ ఉన్నా, షూటింగ్ ఆలస్యమైతే మళ్ళీ వాయిదా తప్పదేమో అన్న భయం అభిమానుల్లో ఉంది.

సుజిత్ ప్రాజెక్ట్‌పై పడుతున్న ప్రభావం:

ఈ సినిమా షూటింగ్ ఎంత లేట్ అయితే, దాని ప్రభావం నేరుగా నాని తర్వాత సినిమా 'బ్లడీ రోమియో' మీద పడనుంది. దర్శకుడు సుజిత్ ఇప్పటికే స్క్రిప్ట్, కాస్టింగ్ అంతా సిద్ధం చేసుకుని నాని డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 'ది ప్యారడైజ్' కోసం నాని పెంచిన జుట్టు, గెడ్డం లుక్ మార్చాలంటే ఆ సినిమా షూటింగ్ పూర్తిగా అయిపోవాలి. ఇక శ్రీకాంత్ ఓదెల గుమ్మడికాయ కొట్టే వరకు, సుజిత్ కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఇతర నటీనటుల కాల్ షీట్స్ కూడా వృధా అయ్యే అవకాశం ఉంది.

మేకోవర్ ఇబ్బందులు.. దర్శకుల మొండిపట్టు:

ఒకప్పుడు నాని ఒకే లుక్ తో రెండు సినిమాలు చేసేవారు, కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా మార్కెట్ కావడంతో ప్రతి సినిమాకు డిఫరెంట్ మేకోవర్ అవసరమవుతోంది. అటు 'పెద్ది', ఇటు 'ప్యారడైజ్' రెండు సినిమాలు కూడా ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇక పాటల చిత్రీకరణ, క్వాలిటీ విషయంలో దర్శకులు ఎక్కడా రాజీ పడకపోవడంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. నిర్మాతలు ఒక తేదీ అనుకుంటే, దర్శకుల మొండిపట్టు వల్ల సినిమా అనుకున్న టైంకి థియేటర్లకు రాలేకపోతోంది.

నాని ఆశలన్నీ ప్యారడైజ్ మీదనే:

నాని ఈ సినిమా కోసం తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో ఈ మూవీతో పెద్ద బ్రేక్ వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. ఇప్పటిదాకా అందని ద్రాక్షలా ఉన్న బాలీవుడ్ మార్కెట్‌ను ఈ సినిమాతో కొల్లగొట్టాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. ఇక ఆగస్టు 21న గనక సినిమా వస్తే అంతా సవ్యంగానే ఉంటుంది, కానీ ఏ మాత్రం తేడా వచ్చినా నాని లైనప్ మొత్తం తారుమారవుతుంది. మరి ఈ సారి నాని అనుకున్న టైంకి బాక్సాఫీస్ దగ్గరకు వస్తారో లేదో చూడాలి!

Tags:    

Similar News