#స‌లార్.. స‌ల‌స‌లా కాగే అందాల వ‌ల‌లో డార్లింగ్ ఫ్యాన్స్

Update: 2020-12-26 05:00 GMT
న‌వ‌త‌రం భామ‌ల్లో అందాల క‌థానాయిక దిశా ప‌టానీ ప్ర‌త్యేక‌త గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. సీకే బ్యూటీగా అందాల వ‌ల‌లు విసిరి సోష‌ల్ మీడియాల్లో సంచ‌ల‌నాలు సృష్టించింది. `లోఫ‌ర్` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైనా.. ఆ త‌ర్వాత సీకే బ్రాండ్ ప్ర‌మోట‌ర్ గానే యూత్ కి బాగా క‌నెక్ట‌య్యింది. ఇక వ‌రుస‌గా బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ ఈ అమ్మ‌డు టాప్ లీగ్ లోకి చేరిపోవ‌డంతో యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేదు.

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన లోఫ‌ర్ త‌ర్వాత తెలుగులో న‌టించే ఆలోచన చేయ‌ని దిశా ఇన్నాళ్టికి టాలీవుడ్ ని క‌నిక‌రించింద‌న్న క‌థ‌నాలు ఇటీవ‌ల ఆస‌క్తిని రేకెత్తించాయి. బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ .. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న స‌లార్ లో దిశా ప‌టానీ నాయిక‌గా నటిస్తోంద‌న‌గానే ఫ్యాన్స్ లో ఉత్సాహం నెల‌కొంది.

స‌ల‌స‌ల కాగే దిశా అందాల ట్రీట్ ఈ మాస్ యాక్ష‌న్ సినిమాలో హీట్ పెంచేయ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఓవైపు వెపన్స్ తో భారీ మాఫియాతో డార్లింగ్ ప్ర‌భాస్ పోరాట స‌న్నివేశాలు.. మ‌రోవైపు సీకే బ్యూటీతో రొమాంటిక్ సీన్స్ హీట్ పెంచుతాయ‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఉన్నారు. అయితే దిశా ప‌టానీని ఖాయం చేస్తూ మైత్రి మూవీ మేక‌ర్స్ బృందం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌లేదు. ప్ర‌స్తుతానికి దిశా సోష‌ల్ మీడియా ఫోటోలు ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో అగ్గి రాజేస్తున్నాయి. ఆ ర‌కంగానూ సీకే బ్యూటీ బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ కి ఇది పెద్ద ప్ల‌స్ గా మారింద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News