న్యూ లైఫ్‌: దిల్ రాజు వెడ్డింగ్ తొలి ఫోటో ఇదే

Update: 2020-05-11 06:15 GMT
అగ్ర నిర్మాత దిల్ రాజు .. త‌న జీవితంలో కొత్త ఫేజ్ గురించి సోష‌ల్ మీడియాల్లో ఎమోష‌న‌ల్ నోట్ ని పంపించిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న రెండో వివాహానికి సంబంధించిన మీడియా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఆ క్ర‌మంలోనే సామాజిక మాధ్య‌మాల ద్వారా రివీలైన ఈ నోట్ చూశాక‌.. ఆయ‌న వివాహానికి సిద్ధ‌మ‌య్యార‌ని అర్థ‌మైంది.

దిల్ రాజు వివాహం ఈ ఆదివారం (మే 10) సాయంత్రం స్వ‌స్థ‌లం అయిన నిజామాబాద్ లో జ‌రిగింది. నిజామాబాద్ - నర్సింగ్ పల్లిలో శ్రీవెంకటేశ్వర స్వామీ దేవాలయంలో అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం జ‌రిగింది. అయితే రాజు గారు పెళ్లాడిం‌ది ద‌గ్గ‌ర బంధువునా?  లేక స్నేహితురాలా? అంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆరాలు క‌నిపించాయి. అయితే ఆయ‌న ఒక బ్రాహ్మ‌ణ యువ‌తిని కులాంతర వివాహం చేసుకున్నార‌ని.. వ‌ధువు గ‌తంలో ఎయిర్ హోస్టెస్ గా ప‌ని చేశార‌ని తెలుస్తోంది. అలాగే ఆమె కుటుంబీకులు అమెరికాలో స్థిర‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఇక ఈ వేడుక‌కు దిల్ రాజు కుమార్తె హ‌న్షితా రెడ్డి అన్నీ తానే అయ్యి వ్య‌వ‌హ‌రించారు. త‌నే పెళ్లి పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించార‌ట‌. నాన్న‌కు అన్నీ తానే అయ్యి వ్య‌వ‌హ‌రించ‌డంపైనా ప్రస్తుతం ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు.

2014లో దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి వివాహం జ‌రిగింది. త‌న వివాహానంత‌రం రెండేళ్ల‌కు త‌న త‌ల్లిగారు అనిత అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ఆ ఘ‌ట‌న దిల్ రాజుకు ఆవేద‌న‌ను మిగిల్చింది. ఇక త‌న తండ్రికి బాగా తెలిసిన అమ్మాయితోనే హ‌న్షిత  ఈ వివాహం కుదిర్చార‌ట‌. ఈ పెళ్లిని తన చేతుల మీదుగానే జరిపించార‌ట‌.  వివాహ వేడుక నుంచి దిల్ రాజు ఆయ‌న భార్యామ‌ణి ఫోటో ఒక‌టి తాజాగా రిలీజైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతోంది.
Tags:    

Similar News