ఆ సినిమా ఒక లైబ్రరీ అంటున్న దిల్ రాజు
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఈ మధ్య కొన్ని చిన్న చిత్రాల ప్రివ్యూలు చూసి ఇంప్రెస్ అయ్యి.. వాటిని తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. ‘సినిమా చూపిస్త మావ’.. ‘కుమారి 21 ఎఫ్’.. ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ లాంటి సినిమాల్ని అలాగే రిలీజ్ చేశాడు. ఈ కోవలో ఆయన బేనర్ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘వెళ్లిపోమాకే’. యాకూబ్ అలీ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా దిల్ రాజు మీద చాలా ప్రభావం చూపిందట. కొత్తగా సినిమాలు తీయాలనుకునే వర్ధమాన దర్శకులకు ఈ చిత్రం ఒక లైబ్రరీ అంటూ ఓ రేంజిలో చెప్పాడు రాజు. ‘వెళ్లిపోమాకే’ ఆడియో వేడుకలో దిల్ రాజు ఈ చిత్రం గురించి ఇంకా ఏమన్నాడంటే..
‘‘వెళ్లిపోమాకే దర్శకుడు యాకూబ్ అలీ ఇంతకుముందు నన్ను కలవాలని ప్రయత్నం చేశాడు. ముందు ఈ సినిమా ట్రైలర్ లింక్ నాకు పంపించాడు. అప్పుడు ఈ సినిమా పేరు వేరు. ట్రైలర్ చూశాను. నచ్చడంతో మా ఆఫీస్ ఎడిటింగ్ రూంకు ఆ సినిమాను తెప్పించుకుని చూశాను. ఇంప్రెస్ అయ్యాను. అప్పటి నుంచి ఈ యూనిట్ తో ట్రావెల్ చేస్తున్నాను. మా వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పెట్టి పద్నాలుగేళ్లు అవుతోంది. ఇంత అనుభవమున్న మా సంస్థ కొత్త వాళ్ళందరూ కలిసి చేసిన ఈ సినిమాను సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే రేపు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి కొత్త సినిమాలు చేయాలనుకునే వాళ్లకు ఈ చిత్రం ఒక లైబ్రరీ అవుతుంది. అలా కొత్త తరహా సినిమాల్ని లైబ్రరీలాగా మార్చాలన్నదే నా ప్రయత్నం. ఈ సినిమా ఎలా తీశారనే విషయంలో ఒక క్లాస్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. సినిమాలో ఎమోషన్స్.. ఈ చిత్రాన్ని తీసిన విధానం అందరికీ నచ్చుతాయి. సినిమా తీసిన బడ్జెట్ ఇప్పుడు చెబితే ఎవరూ నమ్మరు. అందుకే రిలీజ్ తర్వాత ఆ బడ్జెట్ ఎంతో చెబుతాను. ఈ సినిమాకు డబ్బు వస్తుందా రాదా అని నాకు తెలియదు. కానీ ఒక మంచి సినిమాను రిలీజ్ చేయడానికి నా వంతుగా నేను సపోర్ట్ చేస్తున్నాను. కథ బావున్న ఏ కొత్త సినిమాకైనా నా వంతుగా నేను సపోర్ట్ చేస్తాను’’ అని దిల్ రాజు చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/