కళ్యాణం కోసమే ఇన్నిరోజులు పట్టిందేమో!

Update: 2018-07-23 14:30 GMT
నితిన్ తో 'దిల్' అనే సినిమా నిర్మించి ప్రొడ్యూసర్ గా మారి, ఆ సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు రాజు.  ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్లతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.  కానీ తన మొదటి సినిమా హీరోతో మళ్ళీ మరో సినిమా చేసేందుకు దిల్ రాజుకు 15 ఏళ్ళు పట్టడం విశేషం.  దిల్ రాజు బ్యానర్ లో నితిన్ హీరోగా 'శ్రీనివాస కళ్యాణం' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.  ఈ సినిమా ఆడియో వేడుక ఈమధ్యే జరిగింది. ఈ సందర్భం దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా నితిన్ కెరీర్లో ఒక మైల్ స్టోన్ లా నిలిచిపోతుందని చెప్పాడు.

తమ కాంబినేషన్లో సినిమా చేసేందుకు గతంలో ప్రయత్నించినా కుదరలేదని అన్నాడు. నితిన్ వరస ఫెయిల్యూర్ల తో ఇబ్బంది పడుతున్న సమయంలో తనను కలిసి ఒక సినిమా చేయమని అడిగినా ఎందుకో ప్రాజెక్ట్ సెట్ కాలేదన్నాడు.  ఎంత ఆలస్యం అయినప్పటికీ 'శ్రీనివాస కళ్యాణం' లాంటి ఒక ఆద్భుతమైన సినిమాతో తామిద్దరం మళ్ళీ కలవడం సంతోషంగా ఉందని.. ఈ సినిమా నితిన్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందని, తమ సంస్థకు కూడా ఈ సినిమా ప్రత్యేకమైనదని తెలిపాడు. పెళ్లి గొప్పదనాన్ని తెలిపే ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు.

ఆగష్టు 9 న రిలీజ్ కానున్న ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రాశి ఖన్నా నటించింది.  మిక్కి జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు.   దిల్ రాజు-సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చిన 'శతమానం భవతి' గతంలో సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 
Tags:    

Similar News