#డిజిటల్ వర్సెస్ థియేటర్.. కొత్తొక వింత పాతొక రోత!!
ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం కావాలి. ప్రతిసారీ ఇండస్ట్రీలో పాత రికార్డులు బ్రేక్ చేసే సినిమా వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త విషయం పరిచయమై ఆ తర్వాత మిరాకిల్స్ జరుగుతాయని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ కి చెబుతుండేవారట. బాహుబలి రిలీజ్ సమయంలోనూ మహేష్ ఈ విషయాన్ని ప్రస్థావించారు. తాను అన్నట్టే ఆ తరవాత తన మార్కెట్ రేంజును విస్తరించగలిగారు మహేష్. బాహుబలి అనంతరం వచ్చిన శ్రీమంతుడు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ తర్వాతా అంతకంతకు పాన్ ఇండియా రేంజుకు ఎదగాలన్న పంతం పెరిగింది. ఒక మంచి జరిగినప్పుడు దాని పర్యవసానంగా ఆ తర్వాత మరింత మంచి జరుగుతుందే కానీ నష్టం అయితే ఉండదు.
ఇప్పుడు కరోనా వచ్చి సరికొత్త పాఠాలు నేర్పించింది. ఇన్నాళ్లు థియేటర్లలోనే సినిమా వీక్షించాలి! అన్న ఆలోచన ఉండేది. ఇప్పుడు థియేటర్లకు ఆల్టర్నేట్ గా ఓటీటీ డిజిటల్ వీక్షణ అనేది అమాంతం వంద రెట్లు పెరిగింది. మునుముందు థియేటర్లు తిరిగి ఓపెన్ అయినా ఈ విధానంలో మార్పు ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మునుముందు థియేటర్లకు వెళతారు.. ఓటీటీల్ని వదలరు!! అక్కడ చూసి ఇక్కడా చూస్తారు!! అన్న విశ్లేషణ సాగుతోంది. ప్రముఖులంతా ఒక్కొక్కరూ ఒక్కో విశ్లేషణ చెబుతున్నారు. ఇక ఈ సంగతి ఎలా ఉన్నా కానీ... ఇటీవల శాటిలైట్ రైట్స్ ఓటీటీ రైట్స్ కొనుక్కునే వాళ్ల ఆలోచనా ధోరణి మారుతోందని అర్థమవుతోంది. ఇప్పటికే సాయి తేజ్ `సోలో బ్రతుకే సో బెటర్` ఓటీటీ రైట్స్ దక్కించుకున్న జీ స్టూడియోస్ వాళ్లు అటు థియేటర్లలోనూ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారన్న కొత్త విషయం ఆశ్చర్యపరుస్తోంది. అంటే వేదిక ఏదైనా రిలీజ్ చేసే హక్కులన్నీ తమవే అన్నట్టుగా మాట్లాడుకుందిట సదరు సంస్థ. థియేటర్లలో పంపిణీ చేసిన కొద్దిరోజులకే తామే ఓటీటీల్లోనూ రిలీజ్ చేసుకుని క్యాష్ చేసుకుంటారు. అంటే సినిమాని గంపగుత్తగా కొనడం కిందే లెక్క.
ఇప్పుడు అదే ప్రాతిపదికన జీ స్టూడియోస్ వాళ్లు శ్రీవిష్ణు రాజ రాజ చోర సినిమాని కూడా కొనుక్కున్నారట. ఇవే కాదు.. ఇకపై రిలీజ్ కి వచ్చే చాలా సినిమాల్ని ఇదే తరహా డీల్స్ కుదుర్చుకునేందుకు ఓటీటీలు రెడీ అవుతున్నాయిట. అంటే విడిగా డిస్ట్రిబ్యూటర్లకు అమ్మకుండా ఓటీటీ వాళ్లకే తమ సినిమాల థియేట్రికల్ రైట్స్ ని అమ్మేందుకు నిర్మాతలు సంసిద్ధమవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం అంతా ఓటీటీ దిగ్గజాలే చూసుకుంటాయన్నది అర్థమవుతోంది. ఈ క్రైసిస్ కాలంలో ఇదో కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ అనే అనుకోవాలి.