స్టార్ హీరో ఆ క్రేజీ ప్రాజెక్ట్ ని లైట్ తీసుకున్నాడా..?

Update: 2021-12-10 03:30 GMT
ఈరోజుల్లో స్టార్ హీరో - స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా.. అది సెట్స్ మీదకు వెళ్లి, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే దాకా సినిమా సజీవంగా ఉంటుందో లేదో చెప్పలేకపోతున్నాం. హీరో దర్శకనిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ అని లేదా మరేదైనా కారణంతో ఈ మధ్య అనేక ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవ్వడం మనం చూశాం. ఇప్పుడు టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇండస్ట్రీలో ఓ పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన ఓ హీరో.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేశారు. అయితే దీని తర్వాత స్టార్ హీరో చేస్తారనుకున్న సినిమా అటకెక్కినట్లే అని కామెంట్స్ వస్తున్నాయి.

మూడేళ్ళ క్రితం సదరు హీరో టాలీవుడ్ లోని ఓ భారీ ప్రొడక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ తో హీరో గతంలో మంచి హిట్ సినిమాలు చేశాడు. నిర్మాత హీరో మధ్య మంచి అనుబంధం ఉండటంతో డైరెక్టర్ హిట్ ట్రాక్ ని పట్టించుకోకుండా ప్రాజెక్ట్ ఓకే చేశారు. అప్పుడెప్పుడో సెట్స్‌ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ పనులు అనుకున్నట్లుగా జరగ లేదు.

ఈ ప్రాజెక్ట్ తర్వాత అనౌన్స్ చేసిన రెండు సినిమాలు కంప్లీట్ అయినా.. ప్రెస్టీజియస్ మూవీ మీద క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై స్టార్ హీరో అసలు ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియాకు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ లో చాలా మార్పులు చేసినప్పటికీ దర్శకనిర్మాతలు ఈ స్టార్‌ ని మెప్పించలేకపోయారని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమా పూర్తిగా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

అందులోనూ స్టార్ హీరో హోమ్ బ్యానర్ మరియు సదరు ప్రొడ్యూసర్ కలిసి నిర్మించిన హిందీ చిత్రానికి సంబంధించి కొన్ని విభేదాలు వచ్చాయని నివేదికలు వస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ని ప్రారంభించడానికి హీరో సుముఖంగా లేకపోవడానికి ఇది కూడా ఓ కారణమని అనేవారు కూడా లేకపోలేదు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News