ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కు రాజమౌళి అన్యాయం చేశారా..?

Update: 2022-04-04 02:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలతో... ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించబోతున్నాడనే విషయం తెలిసినప్పటి నుంచి అభిమానుల గుండెల్లో ఆనందంతో పాటు గుబులు మొదలైంది. ఎయితే సినిమాకు సంబంధించిన ఓ ఒక్క పోస్టర్ వచ్చినా ఏ హీరో ఎక్కువ హైలెట్ అవుతాడా...  ఎవరిది పై చేయనే చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఏ చిన్న ప్రోమో రిలీజ్ అయినా వారిద్దరి మధ్య పోలికలు చేయడం ఆఫట్లేరు.

ఇక ఈ సినిమా రిలీజై బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న మరో వైపు ఈ సినిమాకు సంబంధించి చర్చలు చేస్తూనే ఉన్నారు. సినిమాలో రామ్ చరణ్ నే ఎక్కువ హైలెట్ అయ్యాడని... తారక్ పాత్రను చాలా తగ్గించేశారంటూ యంగ్ టైగర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చివరి అరగంటలో రాజమౌళి సమతూకం పాటించకుండా చెర్రీ వైపే మొగ్గు చూపాడంటూ చెబుతున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరి సమానంగా పాత్రలను ఇచ్చి సినిమాను చాలా బాగా రూపొందించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే ఇదే విషయాన్ని ఈ చిత్ర రచయిత, డైరెక్టర్ రాజమౌళి తండ్రి వద్ద ప్రస్తావించగా... ఇలా పోలికలు పెట్టొద్దని, అలాంటి వారిని చూస్తేనే తనకు కోపం వస్తుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ అనుకోవడానికి అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
ఇద్దరు హీరోలు ఒకరిని చూసి ఒకరు ఇన్ స్పైర్ అయ్యేలా సమతూకంతో పాత్రలను తీర్చిదిద్దినట్లు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. రామ్ చరణ్ అల్లూరు సీతారామరాజుగా బాగా హైలెట్ అయ్యాడని చెప్తున్న వారికి సమాధానం చెప్తూ... అసలు ఆ పాత్రను అల్లూరిలా మార్చింది ఎవరిని ప్రశ్నించారు.

రామ్ గాయానికి కట్టుకట్టి అతడికి బాణాలు, కాషాయ వస్త్రాలు ఇచ్చి అల్లూరి అవతారంలోకి మార్చింది, అంతకు ముందు కొమురం భీం పాత్రతో ఇన్ స్పైర్ చేసింది భీమ్ యే కదా అని తెలిపారు. అయితే ఇలా రామ్ ని భీమ్ ఇన్ స్పైర్ చేస్తే.. చదువుకునేలా రామ్ భీమ్ ను ఇన్ స్పైర్ చేశాడని విజయేంద్ర ప్రసాద్ వివరించారు.

ఈ విషయాలు చూస్తేనే... ఇందులో ఏ ఒక్క పాత్రను ఎక్కువ కానీ తక్కువ కానీ చేయడం కనిపించదని చెప్పారు. అయినా కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు... జూనియర్ ఎన్టీఆర్ కు లేదని భాద ఆయన అభిమానులకు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి మాటలు, ఆలోచనలు మానుకొని మనస్ఫూర్తిగా సినిమాను ఆస్వాదించమని సూచించారు.
Tags:    

Similar News