పెళ్ల‌య్యాక దియా.. ఆ రూపం స‌మ్మోహ‌న‌మే!

Update: 2021-02-27 09:13 GMT
హైద‌రాబాదీ అమ్మాయి.. మాజీ మిస్ దియా మీర్జా ఫిబ్రవరి 15 న వ్యాపారవేత్త వైభవ్ రేఖీని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. దియాకు వైభ‌వ్ కి కూడా ఇది రెండో వివాహం. దియా ఇటీవ‌ల‌ తన పెళ్లి వేడుక‌కు సంబంధించిన వరుస ఫోటోలను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలు అంతే వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆమె తన మెహెంది వేడుక నుండి కొన్ని చిత్రాలను పంచుకోగా అవివైర‌ల్ అయ్యాయి.

ఈ వివాహం అనంత‌రం త‌దుప‌రి త‌న మూవీ చిత్రీకరణ కోసం దియా దిల్లీకి బయలుదేరినప్పుడు ఆమె ముంబై విమానాశ్రయంలో  కెమెరా కంటికి చిక్కింది. ``ప్రేమ అనేది ఇంటికి పిలిచే పూర్తి వృత్తం. తలుపు తెరిచి దానిని కనుగొనాలి!`` అంటూ దియా ఎమోష‌న్ కి గురైంది. నా విస్తరించిన కుటుంబం... అన్ని పజిల్స్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను! అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది.

తాజాగా ఈ భామ ప్ర‌ఖ్యాత `ఆజా ఫ్యాష‌న్స్` అనే మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపైనా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇందులో దియా ఎంతో ముగ్ధ మ‌నోహ‌ర‌మైన రూపంతో క‌నిపిస్తోంది. ఆ మెరుపులు మిరుమిట్ల చీర‌కు కాంబినేష‌న్ గోల్డెన్ బ్లౌజుతో రాకుమారినే త‌ల‌పిస్తోంది. ఈ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసిన దియా దానికి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యానాన్ని జోడించింది.

నేను ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ‌.. వ‌న్య‌ప్రాణుల సంక్షేమం గురించి మాట్లాడిన‌ప్పుడు వినోద ప్ర‌పంచంలో చాలా తక్కువ‌మందికే దానిపై అవ‌గాహ‌న ఉంది. కానీ ఇప్పుడు అంతా మారింది. అంద‌రికీ ఈ విష‌యం చేరువ‌వ్వ‌డం ఆనందంగా ఉంది. నాతో క‌లిసి ప్ర‌తి ఒక్క‌రూ గొంతు వినిపిస్తున్నందుకు ఈ మార్పు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది అని దియా అన్నారు. పెళ్ల‌య్యాక ఏమాత్రం జోరు త‌గ్గ‌కుండా దియా న‌టిస్తున్నారు. అలాగే వ‌రుస‌ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉండ‌డం ఆస‌క్తిక‌రం.
Tags:    

Similar News