ర‌జినీని సీఎంగా చూడాల‌ని...

Update: 2018-05-10 14:30 GMT
ర‌జినీకాంత్ రాజ‌కీయ తెరంగేట్రంపై ఇప్ప‌టికీ ఎక్క‌డో ద‌గ్గ‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాను పార్టీ పెడ‌తాన‌ని రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించి ఆరు నెల‌లు గ‌డిచిపోయింది. మ‌ళ్లీ ఇంత‌వ‌ర‌కు ఆ టాపిక్ ఎక్క‌డా రాలేదు.  ధ‌నుష్‌ మాత్రం ప‌రోక్షంగా ర‌జినీ ముఖ్య‌మంత్రిగా ఎద‌గాల‌న్న ఆశ‌ను బ‌య‌ట‌పెట్టాడు. ఇప్పుడు కాలా ఆడియో వేడుక‌లో ధ‌నుష్ అన్న మాట‌లు ఇప్పుడు త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

కాలా సినిమా ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో జ‌రిగింది. ఇందులో ధ‌నుష్ మాట్లాడుతు తాను ర‌జినీకాంత్‌కు పెద్ద అభిమానిన‌ని... అభిమానిగానే కాలాను సినిమాను నిర్మించాన‌ని అల్లుడిగా కాద‌ని చెప్పాడు. ర‌జినీ విల‌న్ త‌న కెరీర్‌ను మొద‌లుపెట్టి సూప‌ర్ స్టార్ గా ఎదిగార‌ని గుర్తు చేశారు. రజినీ పేరును వాడుకుని లాభం పొందాల‌ని చూసిన వ్య‌క్తులు.. అత‌డిని వెన్ను పోటు పొడిచిన వ్య‌క్తులు కూడా ర‌జినీని భ‌విష్య‌త్తులో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పాడు ధ‌నుష్‌. ఆ మాటల‌కు వేడుక‌లో ఉన్న వారంతా షాక్ తిన్నారు. కాలా ఆడియో వేడుక‌లో రాజ‌కీయాల టాపిక్ వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఏదేమైనా త్వ‌ర‌లో రాబోయే ఎన్నిక‌ల్లో మామ‌తో పాటూ అల్లుడు కూడా చురుగ్గా ప్ర‌చారంలో పాల్గొన‌డం ఖాయ‌మ‌ని తెలిసిపోయింది.

ఇప్ప‌టికే మ‌రో సూప‌ర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ కూడా రాజ‌కీయ ఎంట్రీ ఇచ్చేశారు. ఓ రాజ‌కీయ పార్టీని కూడా పెట్టారు. ఓ వైపు పార్టీని చూసుకుంటూ మ‌రో వైపు త‌న కెరీర్‌ను కూడా న‌డిపిస్తున్నారు. త్వ‌ర‌లో రాబోయే బిగ్ బాస్ 2కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. రాజ‌కీయ‌నేత‌గా మారాగా ఇలాంటి వేషాలు - యాంక‌రింగ్‌ లు ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌తారా అన్న‌ది సందేహ‌మే.


Tags:    

Similar News