మే నుండి ధనుష్ సినిమా సెట్స్ పైకి..!

Update: 2021-02-20 02:35 GMT
తమిళ హీరో ధనుష్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. ధనుష్ నటించిన 3, రఘువరన్ బీటెక్, మారి లాంటి సినిమాలు అతనికి తెలుగులో క్రేజ్ తీసుకొచ్చాయి. అప్పటినుండి వరుసగా తన సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ నటించిన కొత్త సినిమా ‘జగమే తంతిరమ్‌’. ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో విడుదల కాబోతుంది.

యువదర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తుంది. గతేడాది వేసవిలోనే సినిమా మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ధనుష్‌ గెటప్‌ డిఫరెంట్ గా ఉండబోతుందట. ఇదిలా ఉండగా ధనుష్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Tags:    

Similar News