సామ్ .. దాచాల‌న్నా దాగ‌ని క‌న్నీళ్లు.. ఒత్తిడి!

Update: 2021-10-12 05:10 GMT
టాలీవుడ్ హాట్ పెయిర్ నాగ‌చైత‌న్య - స‌మంత ..ఇప్పుడు క‌లిసి లేరు. అలాంటి జంట అనూహ్యంగా మేము విడిపోతున్నామంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌డం అభిమానుల‌ను క‌ల‌చివేసింది. ఇంత ముచ్చ‌టైన జంట ఇంత తొంద‌ర‌గా విడిపోతుండ‌టం ఏమిటో అంటూ చాలా మంది ఇప్ప‌టికీ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

టాలీవుడ్ తో పాటు వీరి డైవ‌ర్స్ న్యూస్ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ వైర‌ల్ గా మారింది. విడాకుల ప్ర‌క‌ట‌న త‌రువాత మీడియా ముందుకు రాని స‌మంత జెమిని టెలివిజ‌న్ కోసం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` షోకి గెస్ట్ గా రావ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. సామ్ పాల్గొన్న ఎపిసోడ్ ని ఇప్ప‌టికే షూట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

ఈ ఎపిసోడ్ ని ఈ నెల 14న టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రోమో 17 ల‌క్ష‌ల వ్యూస్ ని అధిగ‌మించి రికార్డు సృష్టిస్తోంది. అయితే ఈ వీడియోలో సామ్ ఫేస్ లో డిప్రెష‌న్‌.. క‌ళ్ల‌ల్లో క‌న్నీళ్లు.. క‌నిపిస్తున్నాయ‌ని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. షోలో క‌నిపించిన సామ్ లో ఆ జోష్ క‌నిపించ‌డం లేద‌ని.. సామ్ నిద్ర‌పోయి చాలా రోజులు అవుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. అయితే త‌న ఫీలింగ్స్ ని క‌నిపించ‌కుండా సామ్ మేక‌ప్ చేసుకున్నా త‌న ఫీలింగ్స్ ని క‌నిపించ‌కుండా చేయ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయింది. అత్యంత స‌హ‌జ‌మైన న‌వ్వుతో క‌నిపించే సామ్ లో ఇప్పుడా న‌వ్వులు క‌నిపించ‌క‌పోవ‌డం నిజంగా అభిమానుల‌కు బాధ‌ని క‌లిగిస్తోంది. ఎడ‌బాటు ను త‌ట్టుకోవ‌డం సున్నిత మ‌న‌స్కుల‌కు అంత సులువేమీ కాదు. నిరంత‌ర సంఘ‌ర్ష‌ణ ఇబ్బందిక‌రంగా ఉంటుంది. ఒత్తిడిని పెంచుతుంది.

విడివిడిగా వేరే అపార్ట్ మెంట్ల‌లో జీవ‌నం..!

అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత జంట విడిపోయిన అనంత‌రం ఎవ‌రికి వారు వారి సొంత అపార్ట్ మెంట్ల‌లో నివ‌శిస్తున్నార‌ని తెలిసింది. చై-సామ్ ఇంత‌కుముందు గ‌చ్చిబౌళిలోని ఓ అపార్ట్ మెంట్ లో నివ‌శించారు. ఇప్పుడు ఆ అపార్ట్ మెంట్ లో స‌మంత మాత్ర‌మే ఉంటున్నార‌ని తెలిసింది.

నాగ‌చైత‌న్య హైద‌రాబాద్ లోనే మ‌రో కొత్త అపార్ట్ మెంట్ ని కొనుక్కున్నారు. కొన్నాళ్ల పాటు త‌న కుటుంబ స‌భ్యుల‌కు దూరంగా ఒంట‌రిగా ఈ అపార్ట్ మెంట్ లోనే ఉండ‌ద‌లిచార‌ట‌. నిజానికి అంతా స‌వ్యంగా సాగితే జూబ్లీహిల్స్ లో ఇప్పటికే రెనోవేష‌న్ లో ఉన్న త‌మ విలాస‌వంత‌మైన బంగ్లాలో ఉండేవారు. ఇప్ప‌టికీ ఈ ఇంటికి మ‌ర‌మ్మ‌త్తులు చేస్తున్నార‌ట‌. రెడీ కావ‌డానికి ఏడాది ప‌డుతుంద‌ట‌.
ఇక‌పై ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీ కానున్నార‌ని తెలిసింది. శాకుంత‌లం త‌ర్వాత స‌మంత త‌దుప‌రి ప్రాజెక్టుల‌పై దృష్టి సారిస్తున్నారు. ల‌వ్ స్టోరితో స‌క్సెస్ అందుకుని నాగ‌చైత‌న్య త‌దుప‌రి కెరీర్ పై దృష్టి సారించారు. విక్ర‌మ్ కె ద‌ర్శ‌క‌త్వంలో థాంక్యూ లో న‌టిస్తున్నాడు. అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా.. నాగార్జున‌తో బంగార్రాజు చిత్రాల్లో చేస్తున్నాడు చైత‌న్య‌. ఇవ‌న్నీ రిలీజ్ కి రావాల్సి ఉంది.

షూటింగుల‌తోనే రిలీఫ్ ..!

సమంత ప్ర‌స్తుతం ఎమోష‌నల్ ఘ‌ట్టం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. విడాకుల‌ స‌న్నివేశంలో క‌ల‌త నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ముందుగా వృత్తిలో నిమ‌గ్నం కావాలి. అప్పుడే అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌మ‌ని సమంత భావిస్తున్నార‌ని స‌మాచారం. త్వరలో తన న‌ట‌వృత్తిలో తిరిగి బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే సామ్ కొన్ని సినిమాలకు సంతకం చేసింది. త్వ‌ర‌లోనే షూటింగ్ ల‌ను ప్రారంభిస్తుంది. కొంత‌కాలంగా ఆమె తన విడాకుల విషయంలో గౌరవప్రదమైన మౌనాన్ని పాటిస్తోంది. ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న ఎంఇకే షోలో స‌మంత ఎలాంటి విష‌యాల్ని చెబుతుందా? అన్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది.


Tags:    

Similar News