శర్వానంద్ NNNM.. అన్ని చోట్ల ప్రాఫిట్స్ లోకి..

యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.;

Update: 2026-01-20 06:21 GMT

యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. పండుగ సీజన్‌ టార్గెట్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇప్పుడు అన్ని ఏరియాల్లో లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు.




 


యూనానిమస్ సంక్రాంతి విన్నర్ మూవీ అనే ట్యాగ్‌ లైన్‌ తో రిలీజ్ చేసిన ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం ఆ చిత్రానికి ప్రధాన బలంగా మారింది.

మేకర్స్ తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా నారీ నారీ నడుమ మురారి మూవీ లాభాల్లోకి అడుగుపెట్టిందని తెలిపారు. అన్ని ప్రధాన ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు మంచి రిటర్న్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ఒక క్లియర్ విన్నర్ గా నిలిచిందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.

ఇక నారీ నారీ నడుమ మురారి మూవీలో శర్వానంద్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అందించే రోల్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కరెక్ట్ గా ఉండటంతో, అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుని దూసుకుపోతోంది. ముఖ్యంగా శర్వానంద్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

అదే సమయంలో దర్శకుడు రామ్ అబ్బరాజు సినిమాను డీసెంట్ ఫ్యామిలీ కథగా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. కథలోని సింప్లిసిటీ, పాత్రల మధ్య సన్నివేశాలు, పాటలు.. ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్‌ గా నిలిచాయి. ప్రముఖ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మాణ విలువలు, మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

సంక్రాంతి పండుగ సమయంలో పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, నారీ నారీ నడుమ మురారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదటి రోజు నుంచే మంచి ఆక్యుపెన్సీ నమోదు కావడంతోపాటు రెండో వారంలో కూడా థియేటర్లలో హౌస్‌ ఫుల్స్ నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటినట్లు మేకర్స్ ప్రకటించడం విశేషం.

మొత్తంగా నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బరిలో లాభాల బాట పట్టి, శర్వానంద్ కెరీర్‌ లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. థియేటర్లలో ఇంకా మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చూడాలి ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో..

Tags:    

Similar News