విజయ్ తో పెళ్లి.. అసలు విషయం చెప్పిన రష్మిక!
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగులో ఛలో సినిమా ద్వారా పరిచయమై.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ.. వరుస రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది రష్మిక మందన్న.;
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగులో ఛలో సినిమా ద్వారా పరిచయమై.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ.. వరుస రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది రష్మిక మందన్న. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. హీరోగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుని.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు విజయ్ దేవరకొండ.. అలాంటి వీరిద్దరూ తమ కెరియర్ తొలినాళ్ళలో నటించిన చిత్రం 'గీతాగోవిందం'. ఇందులో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అంతలా తమ అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని అప్పట్లోనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు వీరిద్దరూ కలిసి మళ్ళీ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటించారు. ఈ సినిమాలో కూడా తమ నటనతో మరోసారి మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఇక అప్పటినుంచి వీరిద్దరూ కలసి వెకేషన్ లకి వెళ్లడం, టూర్, ట్రిప్ అంటూ కాస్త సమయం దొరికితే చాలు ఇద్దరూ కలసి విదేశాలలో వాలిపోతూ విడివిడిగా అక్కడికి సంబంధించిన ఫోటోలను పంచుకునేవారు. అయితే వీరు ఎంత రహస్యంగా ఉంచాలనుకున్నా.. ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు.. అందుకే వీరి లొకేషన్లను పసిగట్టి వీరిద్దరి బంధాన్ని ఫైనల్ చేశారు.
ఇక గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ జోరుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీనికి తోడు వీరిద్దరూ గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ విషయాన్ని ఎక్కడ బయట పెట్టలేదు. అయితే వీరి చేతి వేళ్లకు ఉన్న డైమండ్ ఉంగరాలే వీరి నిశ్చితార్థానికి చిహ్నంగా నిలిచాయి. అప్పటినుంచి ఉదయపూర్ లో ఫిబ్రవరి 26న వీరిద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అటు ఈ వార్త అభిమానులలో ఆసక్తితో పాటు ఉత్కంఠను కూడా నెలకొల్పింది.
ఇలా వార్తలు రోజు రోజుకి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఈ విషయంపై స్పందించింది. ఇంటర్వ్యూలో భాగంగా ఉదయపూర్ లో ఫిబ్రవరి 26న మీ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. దీనిపై మీ స్పందన ఏంటి ? అని ప్రశ్నించగా.. రష్మిక మాట్లాడుతూ.. "నిజం చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా చెబుతాను. ఇప్పుడు ఏమి చెప్పలేను. గత నాలుగు సంవత్సరాలుగా వస్తున్న వార్తలన్నింటికీ త్వరలోనే క్లారిటీ ఇస్తాను" అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. అయితే రష్మిక ఈ పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించలేదు అలాగే అంగీకరించలేదు. దీంతో చాలా తెలివిగా సమాధానం చెప్పి మళ్లీ తప్పించుకుంది రష్మిక అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇకపోతే ఖచ్చితంగా శుభవార్త చెబుతుందని అభిమానులు మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రష్మిక ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.