ప‌వ‌న్ కోసం నేష‌న‌ల్ క్రష్ నే ప్లాన్ చేస్తున్నాడా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-01-20 05:03 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసే ప‌నిలో సూరి బిజీగా ఉన్నాడు. `ఏజెంట్` త‌ర్వాత అడ్ర‌స్ లేని సూరి ఈ సినిమాతో ఎలాగైనా కంబ్యాక్ అవ్వాల‌ని అజ్ఞాతంలోకి వెళ్లి మ‌రీ ప‌నిచేసాడు. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలంటూ బిజీగా ఉన్నా? ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం నీ కోసం నేను ఉన్నానంటూ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చారు. నిజంగా సూరికిది గొప్ప అవ‌కాశ‌మే. నిజానికి సూరి ఉన్న ప‌రిస్థితుల్లో మ‌రో స్టార్ అయితే అవ‌కాశం ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌దు.

సూరి కెరీర్ కి కూడా ఈ సినిమా ఎంతో కేల‌క‌మైంది. చావో..రేవో తేల్చుకోవాల్సిన స‌మ‌యం కూడా ఇదే. ప‌వ‌న్ ఇచ్చిన ఈ గొప్ప అవ‌కాశాన్ని ఎంత మాత్రం మిస్ చేసుకోకూడ‌ద‌ని ప‌ని చేస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. అయితే ఇందులో ప‌వ‌న్ కి జోడీగా ఏ హీరోయిన్ తీసుకుంటున్నార‌నే డిస్క‌ష‌న్ న‌డుమ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా పేరు తెర‌పైకి వ‌చ్చింది. ర‌ష్మిక ఇమేజ్ స‌హా స‌క్సెస్ ల న‌డుమ ప‌వ‌న్ కి జోడీగా పర్పెక్ట్ గా సెట్ అవుతుంద‌ని..ఆమె ఎంట్రీతో సినిమాకు మంచి రీచ్ దొరుకుతుంద‌ని టీమ్ భావిస్తుందిట‌.

అయితే ఇది సూరి ఆలోచ‌న కాదుట‌. ఆయ‌న అసిస్టెంట్ ఒక‌రు ర‌ష్మిక అయితే బాగుంటుంది చూడండ‌ని స‌జ్జెస్ట్ చేయ‌గా సూరి కూడా పాజిటివ్ గా స్పందించిన‌ట్లు తెలిసింది. ఈ విష‌యంలో సూరి ఒక్క‌డే సోలో నిర్ణ‌యం తీసుకోవ‌డానికి లేదు. ఎందుకంటే హీరోయిన్ అంటే అందులో హీరో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ప‌వ‌న్ తో త‌ప్ప‌క చ‌ర్చించి తీసుకోవాల్సిన నిర్ణ‌యం. అయితే ఈ సినిమాను ప‌వ‌న్ పాన్ ఇండియా లో ప్లాన్ చేస్తున్నాడా? రీజ‌న‌ల్ సినిమాగా చేస్తున్నాడా? అన్న‌ది కూడా కీల‌క‌మైందే. `ఏజెంట్` తో పాన్ ఇండియాలో సూరి లాంచ్ అవ్వాల నుకున్నాడు.

కానీ రిజ‌ల్ట్ ముందే గుర్తించి చివ‌రి నిమిషంలో` ఏజెంట్` ను రీజ‌న‌ల్ గానే రిలీజ్ చేసారు. లేదంటే పాన్ ఇండియా ప్లాప్ చూసేవారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ తో ఎలాంటి సినిమా తీస్తాడు? అన్న దానిపై కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ర‌ష్మికా మంద‌న్నా పాన్ ఇండియా హీరోయిన్. ఆమెను తీసుకోవాలంటే పారితోషికం కూడా భారీగా చెల్లించాలి. పాన్ ఇండియా సినిమా అయితే ర‌ష్మిక తీసుకున్న పారితోషికానికి న్యాయం జ‌రుగుతుంది. రీజ‌న‌ల్ మార్కెట్ ప‌రంగా చూస్తే ర‌ష్మిక అన‌వ‌స‌ర ప్ర‌య‌త్న‌మే. కొత్త నాయిక‌తో వెళ్తే త‌క్కువ పారితోషికంతోనే తేలిపోతుంది. రీజ‌న‌ల్ గా ప‌వ‌న్ ఇమేజ్ తో నెట్టుకొచ్చేయొచ్చు.

Tags:    

Similar News