అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం..
ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వరుస మరణాలు అభిమానులను తీరని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.;
ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వరుస మరణాలు అభిమానులను తీరని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది వృద్ధాప్య ఛాయలతో స్వర్గస్తులయితే.. మరి కొంతమంది అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు. ఇంకొంతమంది చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని తుది శ్వాస విడుస్తున్నారు.
ఇదిలా ఉండగా ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను అలరించి.. కామెడీ హీరోగా పేరు దక్కించుకున్న అల్లరి నరేష్ ఇంట ఇప్పుడు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు అంటూ అల్లరి నరేష్ ఎమోషనల్ అయ్యారు. మరి అల్లరి నరేష్ ఇంట జరిగిన ఈ విషాదంలో ఎవరు స్వర్గస్తులయ్యారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. దర్శకుడిగా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుని.. ఇండస్ట్రీకి ఆణిముత్యాలు లాంటి చిత్రాలను అందించిన దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ తండ్రి.. ఈదర వెంకట్రావు గారు తాజాగా కన్నుమూశారు. ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకే అల్లరి నరేష్. పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్. ఈదర వెంకట్రావు ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. ఈదర వెంకట్రావు భార్య వెంకటరత్నం గారు 2019 మే 23న మరణించారు..
ఈయన అంత్యక్రియలు నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం దివంగత దర్శకుడు సత్యనారాయణ తండ్రి, ఇటు అల్లరి నరేష్ తాతయ్య ఈదర వెంకట్రావు మరణించారని తెలిసి పలువురు సెలబ్రిటీలు, అభిమానులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈదర వెంకట్రావు మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ఈదర వెంకట్రావు - వెంకటరత్నం దంపతులకు ముగ్గురు కుమారులు.. ఒక కుమార్తె. పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ.. రెండవ కుమారుడు ఈవీవీ గిరి. మూడవ కుమారుడు ఈవీవీ శ్రీనివాస్. కుమార్తె ముళ్ళపూడి మంగాయమ్మ. ఇక వీరంతా పెద్దగా తెలియకపోయినా ఈయన పెద్దకొడుకు ఈవీవీ సత్యనారాయణ దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఆర్యన్ రాజేష్ , అల్లరి నరేష్ వీరి మనవళ్లు..