2027 లో ఐకాన్ స్టార్ రెండు రిలీజ్ ల తోనా?

అటుపై ముంబైలో షూటింగ్ మొద‌లు పెట్టారు. ఇలా ప్రాజెక్ట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ నుంచి 22వ చిత్రం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగానే మారింది;

Update: 2026-01-20 05:30 GMT

2027లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నాడా? ఒకేసారి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో అల‌రించ‌డానికి రెడీ అవుతున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం బ‌న్నీ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ క‌త్వంలో 22వ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కి స్తున్నారు. టెక్నిక‌ల్ గా సినిమాను హైలైట్ చేస్తున్నారు. ఇందులో బ‌న్నీ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ప‌ని చేస్తున్నారు. బ‌న్నీ లుక్ కు సంబంధించి ప్ర‌ఖ్యాత హాలీవుడ్ స్టూడియోస్ లోనే టెస్టింగ్ నిర్వ‌హించారు.

అటుపై ముంబైలో షూటింగ్ మొద‌లు పెట్టారు. ఇలా ప్రాజెక్ట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ నుంచి 22వ చిత్రం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగానే మారింది. అలాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏ భాగాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ రిలీజ్ అవ్వ‌డానికి మాత్రం స‌మ‌యం ఎక్కువ‌గానే ప‌డుతుంది. ఇప్ప‌టికే 2026 ఏడాది ముగింపులో మొద‌టి భాగం రిలీజ్ అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అందులో క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా 2027 మిడ్ లో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని బ‌న్నీ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

అదే ఏడాది మ‌రో సినిమా తో కూడా బ‌న్నీ ప్రేక్ష‌కుల మధ్య‌లో ఉంటాడు అన్న‌ది మ‌రో తాజా అప్ డేట్. ఇప్ప‌టికే కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ కన‌గ‌రాజ్ తో బ‌న్నీ ట‌చ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులుగా ఇద్ద‌రు త‌రుచూ మీట్ అవుతున్నారు. స్టోరీకి సంబంధించిన డిస్క‌ష‌న్స్ వేగంగా జ‌రుగుతున్నాయి. స్టోరీ లాక్ అయింద‌నే ప్ర‌చారం కూడా ఉంది. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది చివ‌ర్లో మొద‌లు పెడ‌తార‌ని తెలిసింది. అనంత‌రం చిత్రానికి సంబంధించి అన్ని ప‌నులు పూర్తి చేసి 2027లోనే రిలీజ్ చేయాల‌నే ప్ర‌ణాళిక‌తో ఉన్న‌ట‌న్లు తెలిసింది.

లోకేష్ క‌న‌గ‌రాజ్ తో సినిమా షూటింగ్ అంటే పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. రెండు...మూడు నెల‌ల్లోనే షూటింగ్ చుట్టేస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ అత‌డు డైరెక్ట్ చేసిన సినిమాల‌కు పెద్ద‌గా స‌మ‌యం తీసుకుంది లేదు. బ‌న్నీ సినిమా కూడా ఇదే ఫార్మెట్ లో ఉంటుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సైతం 30-45 రోజుల మ‌ధ్య పూర్తి చేయ‌గ‌ల‌రు. ఈ నేప‌థ్యంలో ఏడాది చివ‌ర్లో మొద‌లు పెట్టినా? 2027 మిడ్ లో బ‌న్నీ సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. లోకేష్ ఆ ర‌క‌మైన క‌మిట్ మెంట్ ఇవ్వ‌డంతోనే బ‌న్నీ కూడా మూవ్ అవుతు న్నాడ‌ని తెలుస్తోంది. అలాగే బ‌న్నీ అట్లీ సినిమాకు సంబంధించి పార్ట్ 2 షూటింగ్ కూడా పూర్తి చేయాలి. ఈ చిత్రాన్ని 2028 లో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్.

Tags:    

Similar News