కమెడియన్ సత్య.. ఆ రేంజ్ కు చేరుకుంటాడా?
టాలీవుడ్ కమెడియన్ సత్య కోసం ఇప్పుడు జోరుగా సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.;
టాలీవుడ్ కమెడియన్ సత్య కోసం ఇప్పుడు జోరుగా సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సత్య.. పిల్ల జమిందార్ సినిమాలో చిన్న రోల్ లో కనిపించారు. తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత స్వామిరారాలో ముఖ్య పాత్రలో నటించిన ఆయన ఇక వెనక్కి తిరిగి చూడలేదు.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రభస, రౌడీ ఫెలో, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, స్పీడున్నోడు, మజ్ను, జై లవకుశ, ప్రేమమ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, సన్ ఆఫ్ సత్యమూర్తి, మత్తు వదలరా వంటి పలు సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకున్నారు. మధ్యలో వివాహ భోజనంబు ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అదే సమయంలో జబర్దస్త్ వంటి కామెడీ షోల ద్వారా మరింత పాపులర్ అయ్యారు.
మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సత్య సంపాదించుకున్నారు. కమెడియన్ గా తనదైన టాలెంట్ తో మెప్పిస్తున్నారు. గత ఏడాది ఏకంగా ఎనిమిది సినిమాల్లో కనిపించారు. తక్కువ గ్యాప్ లోనే ఆ సినిమాలు రిలీజ్ అవ్వడంతో.. సత్య అన్నింటిలో ఉన్నటే అనిపించారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సంక్రాంతి చిత్రాల్లో కూడా సత్య సందడి చేసిన విషయం తెలిసిందే.
ఐదు చిత్రాలు రిలీజ్ అవ్వగా.. మూడింటిలో కనిపించడం విశేషం. రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి సినిమాల్లో యాక్ట్ చేసి తన కామెడీతో మెప్పించారు. రాజా సాబ్ లో తక్కువ సీన్స్ లోనే ఉన్నప్పటికీ.. తన మార్క్ కామెడీ చూపించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో హీరోయిన్ అసిస్టెంట్ గా నటించి.. రోల్ లో భాగంగా అతి వినయం చూపించి ఫుల్ గా నవ్వించారు.
ఇక నారీ నారీ నడుమ మురారిలో ఆటో డ్రైవర్ గా నటించిన సత్య.. కొన్ని సీన్స్ లో ఆడియన్స్ ను తెగ మెప్పించారు. ఇప్పుడు కొరియన్ కనకరాజు వంటి వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో జెట్లీ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆ సినిమాలన్నీ థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. మొత్తానికి సత్య చేతినిండా చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.
ఏదేమైనా ఇప్పుడు సత్య.. టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న కమెడియన్ గా రాణిస్తున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అంతే కాదు.. ఇంకా జాగ్రత్తగా సినిమాల ఎంపికపై ఫోకస్ చేస్తే మరింత స్టేజ్ కు కచ్చితంగా ఎదుగుతారని అంతా అంటున్నారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ సహా ప్రముఖ కమెడియన్ల రేంజ్ కు చేరుకునే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి సత్య కెరీర్ ఇంకా ఎంతటి రేంజ్ కు వెళ్తుందో వేచి చూడాలి.