వాట్ నెక్స్ట్ మహేష్ అంటే నో అన్సర్!
కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా స్టోరీల పరంగా సెలక్టివ్ గా ఉంటున్నారు. ఏ కథకు తొందరపడి కమిట్ అవ్వడం లేదు.;
కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా స్టోరీల పరంగా సెలక్టివ్ గా ఉంటున్నారు. ఏ కథకు తొందరపడి కమిట్ అవ్వడం లేదు. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సినిమాలు కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలాంటి గందరగోళంలోనే పడ్డాడు. కొరటాల శివ వినిపించిన `దేవర` కథ విషయంలో నిర్ణయం ఎటూ తేల్చుకోలేకపోయాడు. ఈ కారణంగా చాలా సమయం వృద్దాగా పోయింది. కథ విషయంలో తారక్ పూర్తిగా సంతృప్తి గా లేకపోవడంతో రకరకాలుగా మార్పులు చేసారు. చివరిగా తారక్ `దేవర`ను లాక్ చేసాడు.
అయినా రిలీజ్ తర్వాత అతడి అసంతృప్తి నిజంగానే నిజమైంది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అదే సమయంలో శంకర్ తో `గేమ్ ఛేంజర్` కమిట్ అయ్యారు. శంకర్ కావడంతో చరణ్ బ్లైండ్ గా వెళ్లిపోయాడు. కానీ `గేమ్ ఛేంజర్` కూడా అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అప్పటి నుంచి చరణ్ కూడా అలెర్ట్ అయ్యాడు. హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే ముందుకెళ్లే ప్రణాళికతో కనిపిస్తున్నాడు. వీళ్లిద్దరితో పొల్చితే సూపర్ స్టార్ మహేష్ ఇంకెంత కేర్ పుల్ గా ఉంటాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు.
డైరెక్టర్ల విషయంలో మహేష్ ఆచితూచి వ్యవహరిస్తాడు. సినిమాకు కమిట్ అయ్యే ముందు అతడి బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేస్తాడు. ఎన్ని హిట్లు ఉన్నాయి? ఎన్ని ప్లాప్ లు ఉన్నాయి? చివరి సినిమా ఎలాంటి ఫలితం సాధించింది? బాక్సాఫీస్ వద్ద దాని స్టామినా ఎంత? ఇలా లక్ష ప్రశ్నలన్నింటి తాను అనుకున్న విధంగా సమాధానం వస్తేనే కమిట్ అవుతాడు. లేదంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` షూటింగ్ లో మహేష్ బీజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమా చర్చ నెట్టింట మొదలైంది. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు? ఎలాంటి కథను ఎంచుకుంటాడు? అనే డిస్కషన్ జరుగుతోంది. ఈ చర్చ మహేష్ దృష్టికి వెళ్లిందిట. ఈ నేపథ్యంలో మహేష్ సన్నిహితుడు ఒకరు వాట్ నెక్స్ట్ అని క్శశ్చన్ చేసారుట. అందుకు మహేష్ సమాధానంగా బ్లాంక్ ఫేస్ పెట్టారుట. ఏం జరుగుతుందో చూద్దాం..అప్పుడే తొందరెందుకు అన్నట్లు మాట్లాడారుట. `వారణాసి`తో మహేష్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు. ఇదే చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. విదేశాల్లోనూ కనెక్ట్ అయితే పాన్ వరల్డ్ స్టారే. కాబట్టి తదుపరి మహేష్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా, వరల్డ్ కి కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అప్పుడు మహేష్ ఐడియాలజీని అందుకునే దర్శకుడు కావాలి.