వీడియో: సో క్యూట్‌ ల‌వ్ లీ సితార స్టెప్పులే స్టెప్పులు

Update: 2020-08-19 07:15 GMT
సీతా పాప స్టెప్పులే స్టెప్పులు. సో క్యూట్ సితార స్టెప్పు వేస్తుంటే ఇంకేమైనా ఉందా?  అదిరిపోయే వెస్ట్ర‌న్ బీట్ కి రిథ‌మ్ కి త‌గ్గ‌ట్టుగా స్టెప్పులేస్తూ కెవ్వు కేక అనిపించేస్తోంది. `మై లిటిల్ డ్యాన్స‌ర్ బేబి` అంటూ మామ్ న‌మ్ర‌త సంబరం చూస్తుంటే సీతా పాప మ్యాజిక్కే వేరు అనిపించ‌క మాన‌దు.

సితార అంత‌ సింపుల్ గా ఇష్టంగా డ్యాన్స్ చేస్తుంటే.... ఆ స్టైల్ న‌చ్చింది అంటూ సోష‌ల్ మీడియాలో అభిమానులు పొగిడేస్తున్నారు. సీతా పాప డ్యాన్సుల‌కు సంబంధించిన వీడియోల్ని న‌మ్ర‌త రెగ్యుల‌ర్ గా షేర్ చేస్తుంటారు. ఇంత‌కుముందు విదేశాల్లోని ఓ హోట‌ల్ రూమ్ లో స్టే చేసిన‌ప్పుడు చిన్న ఏజ్ లో సితార క్యూట్ గా స్టెప్పులేస్తూ ఆక‌ట్టుకుంది. వ‌చ్చీ రాని స్టెప్పే అయినా ఆ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకోవాలి. ఏదైనా నేర్చుకునేప్పుడు ఇలానే ఉంటుంది. ప‌ర్ఫెక్ష‌న్ వ‌చ్చేశాక ఇక దులిపేస్తారంతే.

ప్ర‌స్తుతం సితార‌ స్కూల్ లో డ్యాన్స్ క్లాసుల‌కు ఎటెండ్ అవుతోంది కాబ‌ట్టి ప‌ర్ఫెక్ష‌న్ వ‌చ్చేస్తోంది. ఇక టీనేజీ వ‌చ్చేప్ప‌టికి సీతాపాప క్లాసిక‌ల్ స‌హా వెస్ట్ర‌న్ డ్యాన్సుల్లోనూ దుమ్ము దులిపేయ‌డం ఖాయం. అయితే సితార న‌టన‌లో ప్ర‌వేశిస్తుందా? క‌మ‌ల్ హాస‌న్ .. నాగ‌బాబు .. ప్రియ‌ద‌ర్శ‌న్ వంటి సెల‌బ్రిటీల డాట‌ర్ లా సితార కూడా క‌థానాయిక అవుతుందా? అన్నదానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.Full View
Tags:    

Similar News