ఏడాది పాటు రాముడి పాత్ర‌పై కస‌ర‌త్తు!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్ర‌తో తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సవాల్‌ను స్వీకరించారు అన్న‌ది కాద‌న‌లేని నిజం.;

Update: 2026-04-05 10:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్ర‌తో తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సవాల్‌ను స్వీకరించారు అన్న‌ది కాద‌న‌లేని నిజం. గ‌తంలో చాలా మంది న‌టులు రాముడి పాత్ర‌లు పోషించారు. సీనియ‌ర్ హీరోల నుంచి త‌ర్వాత త‌రం న‌టు వ‌ర‌కూ ఎంతో మంది రాముడి ఆహార్యంలో మెప్పించారు. కానీ ర‌ణ‌బీర్ క‌పూర్ నేటి అధునిక యుగంలో రాముడి పాత్ర పోషించ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌లే రిలీజ్అ యిన ర‌ణ‌బీర్ క‌పూర్ రాముడి లుక్ చూస్తే రాముడు నిజంగా ఇలాగే ఉంటాడా? అనిపించింది.

అంత‌గా ఆ పాత్ర ఆహార్యంలో ర‌ణ‌బీర్ ఒదిగిపోయారు. ఈ పాత్ర కోసం ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా అంతే శ్ర‌మిస్తున్నారు. కేవలం కెమెరా ముందుకు వచ్చి నటించడం కాదు ఆ పాత్రలోని దైవత్వాన్ని, గాంభీర్యాన్ని ఒంటబట్టిం చుకోవడానికి రణబీర్ దాదాపు ఏడాది కాలం పాటు తీవ్రమైన కసరత్తులు చేసిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ చిత్రంలో రణబీర్ ఒకేసారి రెండు విభిన్నమైన పౌరాణిక పాత్రల్లో కనిపించబోతున్నారు. శాతియుతంగా ఉండే శ్రీరాముడి పాత్ర కాగా, మరొకటి రౌద్రానికి ప్రతిరూపమైన పరశురాముడి పాత్ర.

ఈ రెండు పాత్రల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మికతను , భావోద్వేగాల లోతును అర్థం చేసుకోవడానికే ర‌ణ‌బీర్ కు చాలా సమయం పట్టిందని స్వయంగా వెల్లడించారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ర‌ణ‌బీర్ క‌పూర్ పాత్రల మూలాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన‌ట్లు తెలిపారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి రణబీర్ తన జీవనశైలిని కూడా పూర్తిగా మార్చుకున్నారు. శ్రీరాముడి పాత్రకు అవసరమైన పవిత్రతను కాపాడుకోవడానికి ఆయన మాంసాహారం , మద్యపానానికి దూరంగా ఉన్నాడు. శరీర ఆకృతి నుంచి మాట తీరు వరకు ప్రతి అంశంలోనూ మార్పులు చేసుకున్నారు. వాయిస్ ట్రైనింగ్ ద్వారా రాముడి పాత్రకు ఉండాల్సిన స్పష్టతను, గంభీరతను సాధించేందుకు ప్రత్యేకంగా శ్రమించారు.

షూటింగ్ ప్రారంభానికి ముందే రామాయణానికి సంబంధించిన కొన్ని ముఖ్య‌మైన‌ గ్రంథాలను చదివారు. అందులో రాముడు, ప‌ర‌శార‌ముడి పాత్ర‌లు ఎలా ఉన్నాయి? అన్న దానిపై రివ్యూ చేసుకుని మ‌రి ద‌ర్శ‌కుడు సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో ముందుకెళ్లారు. ఆ పాత్రల మూలాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టారు. వాస్త‌వానికి రాముడి పాత్ర‌లో న‌టించ‌డానికి తొలుత ర‌ణ‌బీర్ క‌పూర్ ముందుకు రాని సంగ‌తి తెలిసిందే. అంత గొప్ప యోధుడి పాత్ర‌లో తాను న‌టించ‌గ‌ల‌నా? ఆ పాత్ర‌కు తాను అర్హుడినే? అనే అంశాల‌ను విశ్లేషించుకునే ఒకే చెప్పారు. ఆ పాత్ర‌ల కోసం ర‌ణ‌బీర్ క‌పూర్ ప‌డిన క‌ష్టం ప్ర‌చార చిత్రాల రూపంలో క‌నిపిస్తుంది. సినిమా రిలీజ్ త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర కానున్నారు.

Tags:    

Similar News