అక్కినేని కోడలు శోభిత కొత్త సాహసం.. షాక్ లో ఫ్యాన్స్!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయడమే కాకుండా అక్కడ సాహసాలు కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో భాగంగానే అక్కినేని కోడలు, శోభిత ధూళిపాల తాజాగా చేసిన సాహసం చూసి అభిమానులు సైతం నోరెళ్ళబెడుతున్నారు. అసలు ఆమె ఎందుకు అంత సాహసం చేసింది అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా శోభిత ధూళిపాల తన సినిమా షూటింగ్ నుండి కాస్త విరామం దొరకడంతో వెకేషన్ కి వెళ్ళిపోయింది. అందులో భాగంగానే జలాంతర్గామిలోకి ప్రవేశించిన ఈమె అక్కడ అందమైన దృశ్యాలను క్యాప్చర్ చేసి వాటిని తన ఫోన్ లో భద్రంగా పొందుపరిచింది. ఇకపోతే చల్లని గాలులకు సముద్రపు అందాలను వీక్షిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. చాలా రోజుల తర్వాత ఇలా ఇంస్టాగ్రామ్ లో షిప్పులో విహరిస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక అలా సముద్రంలోకి ఆమె సాహసోపేతంగా దూకడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 1993 మే 13న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో జన్మించింది శోభిత. బ్రాహ్మణ కుటుంబం విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్లో, విశాఖ వ్యాలీ స్కూల్లో తన స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈమె.. ముంబై యూనివర్సిటీ, హెచ్ ఆర్ కాలేజ్ లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో కూడా శిక్షణ తీసుకుంది శోభిత. చదువుకునే సమయంలోనే మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శోభిత.. 2013లో మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొని రెండవ స్థానాన్ని దక్కించుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనింది ఈ ముద్దుగుమ్మ.2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అడివి శేష్ హీరోగా, మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో కీలకమైన పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తర్వాత బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన శోభిత ఎప్పుడైతే నాగచైతన్యతో ప్రేమలో పడిందో అప్పటినుంచి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడడం.. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం అక్కినేని కోడలిగా చలామణి అవుతూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. అటు సినిమాలతో పాటు ఇటు సిరీస్ లు కూడా చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.;

Update: 2026-04-05 10:40 GMT

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయడమే కాకుండా అక్కడ సాహసాలు కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో భాగంగానే అక్కినేని కోడలు, శోభిత ధూళిపాల తాజాగా చేసిన సాహసం చూసి అభిమానులు సైతం నోరెళ్ళబెడుతున్నారు. అసలు ఆమె ఎందుకు అంత సాహసం చేసింది అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా శోభిత ధూళిపాల తన సినిమా షూటింగ్ నుండి కాస్త విరామం దొరకడంతో వెకేషన్ కి వెళ్ళిపోయింది.




అందులో భాగంగానే జలాంతర్గామిలోకి ప్రవేశించిన ఈమె అక్కడ అందమైన దృశ్యాలను క్యాప్చర్ చేసి వాటిని తన ఫోన్ లో భద్రంగా పొందుపరిచింది. ఇకపోతే చల్లని గాలులకు సముద్రపు అందాలను వీక్షిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. చాలా రోజుల తర్వాత ఇలా ఇంస్టాగ్రామ్ లో బోట్ లో విహరిస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక అలా సముద్రంలోకి ఆమె సాహసోపేతంగా దూకడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

1993 మే 13న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో జన్మించింది శోభిత. బ్రాహ్మణ కుటుంబం విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్లో, విశాఖ వ్యాలీ స్కూల్లో తన స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈమె.. ముంబై యూనివర్సిటీ, హెచ్ ఆర్ కాలేజ్ లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో కూడా శిక్షణ తీసుకుంది శోభిత.

చదువుకునే సమయంలోనే మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శోభిత.. 2013లో మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొని రెండవ స్థానాన్ని దక్కించుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనింది ఈ ముద్దుగుమ్మ.2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అడివి శేష్ హీరోగా, మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో కీలకమైన పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక తర్వాత బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన శోభిత ఎప్పుడైతే నాగచైతన్యతో ప్రేమలో పడిందో అప్పటినుంచి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడడం.. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం అక్కినేని కోడలిగా చలామణి అవుతూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. అటు సినిమాలతో పాటు ఇటు సిరీస్ లు కూడా చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.



Tags:    

Similar News