దురంధ‌ర్-కేర‌ళ స్టోరీలో అన్నీ నిజాలే.. ప్ర‌ధాని మోదీ మ‌ద్ధ‌తు

సంచలన చిత్రాలైన `ది కాశ్మీర్ ఫైల్స్`, `ది కేరళ స్టోరీ` .. ఇటీవల విడుదలైన `ధురంధర్` సినిమాల‌ను ఒక వ‌ర్గం తీవ్రంగా దూషిస్తోంది.;

Update: 2026-04-05 08:15 GMT

సంచలన చిత్రాలైన `ది కాశ్మీర్ ఫైల్స్`, `ది కేరళ స్టోరీ` .. ఇటీవల విడుదలైన `ధురంధర్` సినిమాల‌ను ఒక వ‌ర్గం తీవ్రంగా దూషిస్తోంది. కానీ ఇప్పుడు ఈ సినిమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రాల్లో చూపించిన అంశాలను అబద్ధాలని కొట్టిపారేసే వారికి ప్రధాని గట్టి కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలను సమాజానికి తెలియజేస్తున్న ఇలాంటి సినిమాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ముఖ్యంగా `ది కేరళ స్టోరీ` వంటి సినిమాలను ప్రధాని బహిరంగంగా సమర్థించడం ఒక కీలక పరిణామంగా భావించాలి. సమాజంలో జరుగుతున్న `లవ్ జిహాద్` (నిన్న హైద‌రాబాద్ లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూడాలి) వంటి సున్నితమైన తీవ్రమైన అంశాలపై ప్రభుత్వ పెద్దలకు పూర్తి అవగాహన ఉందనే విషయాన్ని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం వినోదం కోసమే కాకుండా.. సమాజంలోని చేదు నిజాలను వెలికితీసే ప్రయత్నాన్ని ఆయన అభినందించారు.

ఇక గూఢచారి థ్రిల్లర్ కాన్సెప్టుతో వచ్చిన `ధురంధర్` సినిమాను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఈ చిత్రంలో చూపించిన ప్రతి సంఘటన వాస్తవంగా జరిగినదేనని.. వాటన్నింటినీ ఒక కథగా అల్లి ప్రజల ముందుకు తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను విమర్శించే వారికి ప్రధాని మద్దతు ఒక పెద్ద సమాధానంగా నిలిచింది.

సినిమాలపైనే కాకుండా దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకువస్తున్న చట్టాలపై కూడా కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్ (SIR), `యూనిఫాం సివిల్ కోడ్` (UCC) వంటి అంశాలపై కూడా కొన్ని వర్గాలు కావాలనే అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నాయని మోదీ హెచ్చరించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

ఓవ‌రాల్ గా వాస్తవాలను కప్పిపుచ్చాలని చూసే వారి ప్రయత్నాలు ఇక సాగవని ప్రధాని వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. సినిమాలు సమాజానికి అద్దం పడుతున్నాయని.. వాటిని వ్యతిరేకించే వారు వాస్తవాలను అంగీకరించలేక పోతున్నారని దేశ ప్ర‌ధాని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు అటు సినీ వర్గాల్లోనూ.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ల‌వ్ జిహాదీ భార‌త‌దేశంలో అలాగే హైద‌రాబాద్ స‌హా ఇత‌ర న‌గ‌రాల్లోను ఎగ్జిస్టెడ్ అని ప్ర‌ధాని కూడా త‌న స్పీచ్ లో స్ప‌ష్ఠం చేసారు.



Tags:    

Similar News