చైల్డ్‌హుడ్ ట్రామా గురించి షేర్ చేసిన సమీరా
సినీ నటి సమీరా రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.;
సినీ నటి సమీరా రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. చిన్నప్పటి అసురక్షిత భావాల నుంచి బయటపడుతున్న తన జర్నీని ఆమె షేర్ చేసుకోవడం పలువురిని ఆలోచింపజేస్తోంది. చిన్నప్పుడు నాకు ఎప్పుడూ నమ్మకం ఉండేది కాదని, ఆ సమయంలో ఉన్న ఆ డార్క్ గా, బొద్దుగా, అసురక్షితంగా అనిపించే ఆ అమ్మాయిని ఇప్పుడు చూస్తే నువ్వు ఎంత అద్భుతంగా మారబోతున్నావో తెలుసా అని చెప్పాలనిపిస్తుందంటూ సమీరా తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె పర్సనల్ లైఫ్ లో అంతర్మథనం ఎంత లోతుగా జరిగిందో తెలియచేస్తుంది. ఈ పోస్ట్‌లో సమీరా ఇచ్చిన మెసేజ్ కేవలం తన పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రమే కాకుండా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అనే మోటివేషనల్ మెసేజ్ ను ఇస్తూ దాంతో ఎంతో మందికి ప్రేరణనిస్తున్నారు. ముఖ్యంగా, జీవితంలో ఒక దశలో తమపై తమకే నమ్మకం కోల్పోయిన వారు తిరిగి ఎదగగలరనే నమ్మకాన్ని ఆమె మాటలు బలపరుస్తున్నాయి.
తల్లిగా మారాక ఆలోచనల్లో ఎన్నో మార్పులు
అదే సమయంలో, తాను తల్లిగా మారిన తర్వాత తన ఆలోచనల్లో వచ్చిన మార్పును కూడా సమీరా స్పష్టంగా వివరించారు. పిల్లలకు కరుణ, దయ నేర్పడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో తమకు తామే బౌండరీస్ ను పెట్టుకోవడం, తమపై తమకు నమ్మకం నమ్మకం కలిగి ఉండడం నేర్పించడం కూడా అంతే అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. పేరెంటింగ్‌లో ఈ సమతౌల్యం ఎంత కీలకమో ఆమె తన అనుభవం ద్వారా తెలియజేశారు.
మెంటల్ హెల్త్ కోణంలో కూడా సమీరా చేసిన పోస్ట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. చిన్నప్పటి అనుభవాలు మనపై ఎంతటి ప్రభావం చూపిస్తాయో, వాటి నుంచి బయటపడటానికి అన్ లెర్నింగ్ అనే ప్రక్రియ ఎంత అవసరమో సమీరా తన మాటల్లో చెప్పారు. ఇది మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా ఒక ముఖ్యమైన సందేశంగా మారింది.
ఎవరికైనా ఎమోషనల్ హెల్ప్ అవసరం
ఈ మెసేజ్ తో సమాజానికి కూడా సమీరా ఒక స్పష్టమైన పిలుపునిచ్చారు. మనకు ప్రియమైన వాళ్ల చుట్టూ నిలబడాలి, వాళ్లను కాపాడాలి, బలపరచాలి, వాళ్ల మాట వినాలంటూ ఆమె చెప్పిన మాటలు సోషల్ మెసేజ్‌గా నిలిచాయి. పిల్లలైనా, పెద్దలైనా.. ప్రతి ఒక్కరికీ ఎమోషనల్ హెల్ప్ ఎంత ఎంత అవసరమో ఆమె గుర్తుచేశారు. ఇక బాడీ పాజిటివిటీ, సెల్ఫ్ లవ్ అంశాల్లో కూడా సమీరా తన అనుభవాలను నిజాయితీగా పంచుకుంది. తన రూపం గురించి గతంలో కలిగిన అనుమానాలను దాటి, ఈరోజు తనను తాను అంగీకరించుకునే స్థాయికి చేరుకున్న విధానం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఈ ఎమోషనల్ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆమె నిజాయితీ, ఓపెనెస్‌ను ప్రశంసిస్తూ అనేక మంది తమ అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. మొత్తానికి, చిన్నప్పటి నమ్మకం లేని స్థితి నుంచి ఈరోజు ఆత్మవిశ్వాసంతో నిలబడే స్థాయికి చేరుకున్న సమీరా రెడ్డి లైఫ్ జర్నీ మహిళా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె మాటలు కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, అనేక మంది జీవితాలకు అద్దం పట్టే సందేశంగా మారాయి.