ఒకే కథని ఇంత మంది చెబితే కష్టమేమో?
అదే పనిని ముగ్గురు ఒ్ఏసారి చేస్తే ఎవరి పని బాగుంది?..ఎవరి ఎఫర్ట్ బాగుందన్నది చెప్పడం కొంతం కష్టంగా ఉంటుంది.;
ఒక పనిని ఒకరు చేస్తే అందులో కొత్తదనం ఉంటుంది దాంతో సర్‌ప్రైజ్ అవుతాం. అదే పనిని ముగ్గురు ఒ్ఏసారి చేస్తే ఎవరి పని బాగుంది?..ఎవరి ఎఫర్ట్ బాగుందన్నది చెప్పడం కొంతం కష్టంగా ఉంటుంది. అంతే కాకుండా ఒకే పనిని ముగ్గురు ఒకేసారి చేస్తే దానిపై పెద్దగా ఆసక్తి ఎవరికీ ఏర్పడే అవకాశం ఉండదు. అంతే కాకుండా ఇది ఆ పనిని కిల్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఫైనల్‌గా కిల్ చేస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఓ పురాణ కథ ఎదుర్కొనే ప్రమాదం ఉందా? అంటే జరుగుతున్న పరిణామాల బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే...కొన్నేళ్ల క్రితం ఓ కథని అక్కినేని నాగేశ్వరరావు చేశారని, దాన్ని నేను కూడా చేస్తానని సూపర్ స్టార్ కృష్ణ చేశారు..భారీ డిజాస్టర్‌ని ఎదుర్కొన్నారు..అదే దేవదాస్`. అక్కినేని చేసిన `దేవదాస్` విరహ ప్రేమకథలకు బెంచ్ మార్క్‌ని సెట్ చేస్తే,అదే కథతో సూపర్‌స్టార్ కృష్ణ చేసిన `దేవదాసు` అట్టర్ ఫ్లాప్‌గా నిలిచి విమర్శలు ఎదుర్కొంది. అప్పటి నుంచి ఒకే కథని ఇద్దరు చేయడం మానేశారు. అలాంటి ప్రయత్నాలు కూడా ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ఒకే కథని ముగ్గురు చేయడానికి రెడీ అవుతుండటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అదే కుమారస్వామి కథ. భారీ మైథలాజికల్ డ్రామాగా అత్యంత భారీ కాన్వాస్‌పై త్రివిక్రమ్ తెరకెక్కించాలని గత కొంత కాలంగా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ముందు అల్లు అర్జున్‌తో దీన్ని తెరపైకి తీసుకొస్తారని ప్రచారం జరుగింది. అధికారికంగా ఓ వీడియోని కూడా విడుదల చేశారు. అయితే ప్రీ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టే స్క్రిప్ట్ కావడంతో దీన్ని పక్కన పెట్టిన బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. దీనితో పాటు లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్, బసిల్ జోసెఫ్ సూపర్ హీరో తరహా కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
దీంతో ఈ ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్‌తో చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇదే తరహా స్టోరీని దర్శకుడు కిషోర్ తిరుమల కూడా రెడీ చేసి దీనికి తగ్గ హీరో, ప్రొడ్యూసర్ కోసం వేట మొదలు పెట్టాడు. భారీ స్పాన్ ఉన్న కథ కావడంతో భారీ నిర్మాణ సంస్థ, స్టార్ హీరో కోసం అన్వేషన్ మొదలు పెట్టాడు. అయితే కిషోర్ తిరుమలకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు చాలా తక్కువ. ఇంత వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఆయన ఖాతాలో లేదు. భారీ పాన్ ఇండియా సినిమా ట్రై చేయలేదు. ఆ కారణంగా ఆయన ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కొంత కష్టమే.
ఇక మరో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఇదే కథతో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా స్టోరీ, ప్రొడక్షన్ వరకు తను చూసుకుంటూ డైరెక్షన్ బాధ్యతల్ని మరొకరికి అప్పగించాలని, షోరన్నర్‌గా ఉండాలని భావిస్తున్నాట. ఇలా త్రివిక్రమ్‌తో పాటు కిషోర్ తిరుమల, ప్రశాంత్ వర్మ..ఈ ముగ్గురూ ఒకే కథని పట్టుకుని ప్రయత్నించడం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇద్దరు చెబితేనే కష్టం..అలాంటిది ముగ్గురు చెప్పడానికి రెడీ అవుతుండటం కుమారస్వామి కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని కొంత మంది హెచ్చరిస్తున్నారు.