టోవినో 'పళ్లిచట్టంబి'.. ట్రైలర్ తో మరింత హైపెక్కించారుగా!

మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం పళ్లిచట్టంబి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.;

Update: 2026-04-05 08:21 GMT

మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం పళ్లిచట్టంబి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌ గా కయాదు లోహర్ నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా, సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

1950ల కాలంలో కేరళలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కల్పిత కథగా మూవీని రూపొందిస్తున్నారు. ఆ కాలంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను సహజంగా చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గ్రామీణ వాతావరణం, పాతకాలపు జీవనశైలి, విశ్వాసం.. అన్నీ కలిసి ఒక విభిన్న ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి.

ట్రైలర్ ప్రారంభం నుంచే ఉత్కంఠ రేకెత్తించే విధంగా సాగుతుంది. 'తన భూమిపై హక్కు తిరిగి దక్కించుకోవడానికి వస్తాడు సర్… గడ్డ నరనరాలను తెంచేస్తాడు… ఆ నేల అసలైన యజమాని' అనే డైలాగ్‌ తో కథలోని స్టోరీ లైన్ ను రివీల్ చేశారు. అనంతరం టొవినో పవర్‌ ఫుల్ ఎంట్రీతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పాత్రలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుండటం విశేషం.

సినిమాలో టోవినో థామస్ ఇప్పటివరకు కనిపించని రీతిలో సరికొత్త అవతార్ లో కనిపిస్తారని ట్రైలర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. ఒక వైపు రౌడీయిజం, మరోవైపు వ్యక్తిగత భావోద్వేగాలు కలిసిన పాత్రలో ఆయన కనిపించనున్నారు. హీరోయిన్‌ తో లవ్ ట్రాక్ కూడా కథలో కీలకంగా ఉండబోతుందని అర్థమవుతోంది. మరోవైపు ట్రైలర్‌ లో మిస్టరీ, మైథాలజీ అంశాలు కూడా కనిపించడం విశేషం.

పిశాచి శక్తులు, దైవ భక్తి మధ్య సాగే కథాంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఆ ఎలిమెంట్స్.. సినిమాను సాధారణ యాక్షన్ డ్రామా కంటే భిన్నంగా నిలబెట్టేలా ఉన్నాయి. విజువల్స్, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ ట్రైలర్ కు మెయిన్ అసెట్స్ గా మారాయి. చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిల్మ్స్. సీ క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజేష్, చాణుక్య చైతన్య చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఆ సినిమాపై ఇప్పుడు ట్రైలర్ తో మరింత హైప్ పెంచారు.

ఇప్పటివరకు రియలిస్టిక్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన టోవినో థామస్, ఈసారి మరింత విభిన్నమైన కథతో ముందుకు వస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌ డ్రాప్, యాక్షన్ ఎలిమెంట్స్, మిస్టరీ అంశాలు.. అన్నీ కలిసిన ఆ చిత్రం ఆయన కెరీర్‌ లో ప్రత్యేక స్థానం సంపాదించేలా ఉంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో ఆ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ గా నిలుస్తుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News