బిగ్ స్క్రీన్‌కి శ‌ర్వా ఏం చేశాడో తెలుసా?

ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బ‌రిలో నిలిచి సూప‌ర్ హిట్ మూవీని త‌న ఖాతాలో వేసుకున్న హీరో శ‌ర్వానంద్‌.;

Update: 2026-04-05 08:44 GMT

ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బ‌రిలో నిలిచి సూప‌ర్ హిట్ మూవీని త‌న ఖాతాలో వేసుకున్న హీరో శ‌ర్వానంద్‌. నారి నారి న‌డుమ మురారి` అంటూ ల‌వ్ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన శ‌ర్వా ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించి మంచి స‌క్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ త‌రువాత శ‌ర్వా నుంచి వ‌చ్చిన చిత్రం `బైక‌ర్‌`. మోట‌ర్ బైక్ రేసింగ్ స్టోరీకి సున్నిత‌మైన భావోద్వేగాల్ని జోడించి చేసిన ఈ మూవీ రీసెంట్‌గా విడుద‌లై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.

ఇందులో డా. రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో శ‌ర్వాకు తండ్రిగా న‌టించారు. వీరిద్ద‌రి నేప‌థ్యంలో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ సినిమాకు వ‌న్ ఆఫ్ ది హైలైట్‌గా నిలుస్తున్నాయి. రీపెంట్‌గా విడుద‌లైన ఈ సినిమాపై కింగ్ నాగార్జున ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించడం తెలిసిందే. కుటుంబ ల‌నుబంధాలు, ఫ్యామిలీ ఎమోష‌న్స్ ప్ర‌ధానంగా సాగి అంద‌రిని ఆక‌ట్టుకుంటోందని, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని అందంగా ఆవిష్క‌రించిన సినిమా అని కొనియాడారు. రేసింగ్ స‌న్నివేశాలు, క్లైమాక్స్ ఎంతో అద్భుతంగా ఉంద‌న్నారు.

దీంతో `బైక‌ర్‌` ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే చాలా రోజుల త‌రువాత `నారీ నారీ న‌డుము మురారీ`, ఇప్పుడు `బైక‌ర్‌`తో బ్యాక్ టు బ్యాక్ స‌క్సెలు రావ‌డంతో శ‌ర్వానంద్ చాలా హ్యాపీగా క‌నిపిస్తున్నారు. ఏప్రిల్ 3న విడుద‌లైన ఈ సినిమాకు యునానిమ‌స్‌గా సూప‌ర్ హిట్ టాక్ రావ‌డం, థియేట‌ర్లు హౌస్ ఫుల్స్‌తో ర‌న్న‌వుతుండ‌టంతో శ‌ర్వానంద్ సిటీలోని థియేట‌ర్ల‌ని విజిట్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఇందులో భాగంగా హైద‌రాబాద్ సిటీలోని శ్రీ‌రాములు థియేట‌ర్‌కు వెళ్లిన శ‌ర్వానంద్ అక్క‌డి బిగ్ స్క్రిన్ ముందు చేసిన ప‌నికి అంతా ఫిదా అవుతున్నారు. శ్రీ‌రాములు థియేట‌ర్‌లోని బిగ్ స్క్రిన్ ముందుకు వెళ్లిన శ‌ర్వానంద్ తెర‌ను ముద్దాడి, న‌మ‌స్క‌రించి సాష్టాంగ న‌మ‌స్కారం చేయ‌డం అక్క‌డున్న ఆడియ‌న్స్‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఒక్క సారిగా థియేట‌ర్ అభిమానులు, ప్రేక్ష‌కులు హ‌ర్ష‌ధ్వానాల‌తో మారుమోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారి సంద‌డి చేస్తోంది.

Tags:    

Similar News