బ్లాక్ బస్టర్ కాంబోపై క్రేజీ రూమర్..!

Update: 2021-05-01 07:02 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బ్లాక్ బస్టర్ గా బాప్ అనిపించుకుంది. ఇది మహేష్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో మరో మూవీ రానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల 'గాలి సంపత్' ప్రమోషన్స్ లో మహేష్ తో ఇంకో సినిమా ఉండొచ్చని, కలిసి మాట్లాడాలని డైరెక్టర్ అనిల్ చెప్పుకొచ్చారు. దీంతో మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనీల్ తోనే ఉంటుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో '#SSMB28' ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యారు మహేష్.

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమానే ఉంటుంది. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తో ఓ పాన్ ఇండియా మూవీ చేయాల్సి ఉంది. దీంతో అనిల్ రావిపూడితో సినిమా ఉండకపోవచ్చని అనుకున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ - అనిల్ కాంబినేషన్ లో కచ్చితంగా మరో సినిమా చేస్తారని తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతం మహేష్ కమిటైన సినిమాల తర్వాతే ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా ఇది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి సీక్వెల్ అని కూడా టాక్ వస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాపై వర్క్ చేస్తున్నాడు. దీని తర్వాత నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News