• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్రహ్మి రచ్చ రచ్చ...

బ్రహ్మి రచ్చ రచ్చ చేశాడుగా..

By - Tupaki Desk
Update: 2018-04-28 04:26 GMT
మూడేళ్లుగా తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం హవా పెద్దగా కనిపించడం లేదు. మూడు దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేస్తూ టాప్ కమెడియన్ గా కొనసాగిన ఆయన.. ఈ మధ్య ఎప్పుడో కానీ సినిమాల్లో కనిపించడం లేదు. చాన్నాళ్ల తర్వాత బ్రహ్మి కీలక పాత్ర చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగానో లేక మామూలుగానో బ్రహ్మానందం తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బయటికి వచ్చిన ఆయన మీడియా వాళ్లతో పరాచికాలాడిన తీరు నవ్వులు పూయించింది.

గుడిలోంచి బయటికి వస్తూ దండం పెట్టుకుని మీడియా వాళ్ల వైపు చూసిన బ్రహ్మి ఓవైపు తనను కెమెరామెన్లు వీడియోలు, ఫొటోలు తీస్తుండగానే అలాగే వడి వడిగా ముందుకు నడిచాడు. తనను పొటో తీస్తున్న వ్యక్తిని చూస్తూ నువ్వు ఫొటో తీయట్లా నన్ను చూస్తున్నావ్ అంటూ నవ్వాడు. తర్వాత నేను ఇలాగే నడుస్తుంటారా మీరు ఫొటోలు తీస్కోండి అంటూ ఒక పోజిచ్చాడు. ‘ఆచారి అమెరికా యాత్ర’ గురించి అడిగితే.. అవును ఈ రోజే రిలీజ్.. గుడి లోపలంతా ఆచారులే అన్నాడు బ్రహ్మి.తనను మీడియా వాళ్లు పలు అంశాలపై ప్రశ్నలడుగుతున్నా బ్రహ్మి పట్టించుకోలేదు. ఒక విలేకరి పవన్ గురించి అడిగినా లైట్ తీసుకున్నాడు. ఇంకో ప్రశ్న ఏదో ఎదురైతే నువ్వు అడగడం నేను చెప్పడం అంటూ సమాధానం దాటవేసి ముందుకు వెళ్లిపోయాడు. ‘ఆచారి అమెరికా యాత్ర’లో పెద్దగా నవ్వించలేకపోయిన బ్రహ్మి.. ఇలా బయట మాత్రం భలే నవ్వించేశాడనే చెప్పాలి.
Tags:    
  • Comedian Brahmanandam 
  • Tirumala 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS