నందమూరి బ్రదర్స్ మధ్య బయోపిక్ గొడవ!?
జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్.. ఈ నందమూరి సోదరుల మధ్య బాండింగ్ సూపర్ గా ఉంటుంది. కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. ఎన్టీఆర్ హీరోగా జైలవకుశ సినిమా కూడా రూపొందింది అంటే.. వీరి బంధం అర్ధమవుతుంది. అయితే.. వీరిద్దరి మధ్య ఇప్పుడు విబేధాలు తలెత్తాయనే టాక్ గట్టిగానే వినిపిస్తూనే ఉంది. ఇందుకు కారణంతో పాటు సాక్ష్యంగా కూడా బయోపిక్స్ నిలుస్తున్నాయి.
కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే.. నా నువ్వే ప్రమోషన్స్ కు ఎన్టీఆర్ నుంచి ఏ మాత్రం సపోర్ట్ అందడం లేదు. ఇదే ఆశ్చర్యం కలిగిస్తోంది. జైలవకుశ కలెక్షన్స్ వీరి మధ్య అంతరం ఏర్పడడానికి కారణం అంటున్నారు కానీ.. బయోపిక్ ల గొడవ ఒకటి వెనకాల నడుస్తోందట. బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు జూనియర్ కు ఆహ్వానం అందలేదు. ప్రారంభోత్సవ కార్యక్రమం నుంచి.. ఆ ప్రాజెక్టులో ఏ రకంగానూ యంగ్ టైగర్ ను భాగస్వామ్యం చేయలేదు. కానీ ఈ ప్రాజెక్టులో కళ్యాణ్ రామ్ కి భాగం ఉంది. ఓపెనింగ్ ఫంక్షన్ కు కూడా వెళ్లాడు. అప్పటి నుంచి ఈ బ్రదర్స్ మధ్య గ్యాప్ ఏర్పడిందట.
రీసెంట్ గా మహానటి అంటూ సావిత్రి బయోపిక్ గా రూపొందిన మూవీ ఆడియోకు కూడా ఎన్టీఆర్ వచ్చాడు. కానీ కళ్యాణ్ రామ్ మూవీ ఫంక్షన్ కు మాత్రం అటెండ్ కాకపోవడంతో.. సినీ జనాలు ఇదే మాట్లాడుకుంటున్నారు. మహేష్ సినిమాకు.. మహానటి మూవీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ రెండు సినిమాలకు దూరంగా ఉండడాన్ని పాయింట్ చేసి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తో మొదలైన గొడవ.. సావిత్రి బయోపిక్ దగ్గర నిరూపితం అయిందన్న మాట.