ఈ స్థాయి ఫాలోయింగ్ టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో ఎవ‌రికి ఉంది?

ఒక సినిమా వ‌చ్చి వెళ్లాక కూడా ఈ సినిమాలో ఫ‌లానా పాత్ర‌లో ఆ స్టార్ న‌టించి ఉంటే బావుండేది లాంటి డిబేట్ ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ చూసి ఉండ‌దు. కానీ అలాంటి డిబేట్ `దురంధ‌ర్` విష‌యంలో కొన‌సాగుతోంది.

Update: 2026-06-20 00:30 GMT

ఒక సినిమా వ‌చ్చి వెళ్లాక కూడా ఈ సినిమాలో ఫ‌లానా పాత్ర‌లో ఆ స్టార్ న‌టించి ఉంటే బావుండేది లాంటి డిబేట్ ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ చూసి ఉండ‌దు. కానీ అలాంటి డిబేట్ `దురంధ‌ర్` విష‌యంలో కొన‌సాగుతోంది. ఈ సినిమాలో ఫ‌లానా స్టార్ ఫ‌లానా పాత్ర‌లో న‌టించి ఉంటే ఇంకా బావుండేది అనే డిస్క‌ష‌న్ ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన దేశభక్తి (ప్రో-ఇండియన్) చిత్రాలలో ఒకటిగా నిలిచిన `ధురంధర్` ఫ్రాంచైజీ గురించి సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికర చర్చలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక చర్చా వేదికలో బాలీవుడ్‌కు చెందిన అద్భుతమైన నటుడు కేకే మీనన్‌ను ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని కొందరు అభిమానులు వ్యక్తం చేశారు. కేకే మీనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూనే.. ర‌క్తి క‌ట్టించే దేశభక్తి ప్రసంగాలు ఇవ్వడంలో `బాలీవుడ్ కా ధురంధర్` అని నెటిజన్లు కొనియాడారు. సినిమాలో ఆయన ఉండి ఉంటే రెహమాన్ డకైత్ లేదా మేజర్ ఇక్బాల్, లేదా అజిత్ దోవల్ (అజయ్ సన్యాల్) సబార్డినేట్ పాత్రలకు మరింత వాల్యూ వచ్చేదని నెటిజన్లు విశ్లేషించారు.

అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం ఈ సినిమా ఎలా ఉందో అలాగే పర్ఫెక్ట్‌గా ఉందని వాదించారు. సినిమాలో రెహమాన్ డకైత్‌గా నటించిన అక్షయ్ ఖన్నా తన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేశారని, ఆయన నటన అత్యంత అద్భుతంగా సాగిందని రెడ్డిట‌ర్లు ప్రశంసించారు. `ధురంధర్` చిత్రంలో జామాలి నిజమైన ఐడెంటిటీ బయటపడటం, హంజా చేసిన త్యాగం .. రెహమాన్ పాత్రకు సంబంధించిన సైకలాజికల్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేశాయని చర్చించుకుంటున్నారు.

ఎక్కువ మంది పెద్ద స్టార్లు ఉంటే కథ పాడవుతుంది అన్నట్లుగా.. టూమెనీ స్టార్ల‌ను ఆదిత్యాధ‌ర్ ఎంపిక చేయ‌లేద‌ని... అలా కాకుండా బ్యాలెన్స్ డ్ గా త‌న స్క్రిప్టుకు త‌గ్గ‌ట్టు ఎంచుకున్నార‌ని కూడా కొంద‌రు విశ్లేషించారు. ఈ సినిమాను ఉన్నదున్నట్లుగా ఒక పర్ఫెక్ట్ మాస్టర్‌పీస్‌గా మల‌చ‌డం కోసం ఎలాంటి కాస్టింగ్ కావాలో అలాంటి వారిని ఎంపిక చేసుకున్నార‌ని కూడా కొంద‌రు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అయితే దురంధ‌ర్ చిత్రంలో కేకే మీన‌న్ న‌టించారా లేదా? అన్న‌ది అటుంచితే.. ఒక న‌టుడి మీద ఈ స్థాయి అభిమానం పొంగి పొర్లుతోంది అంటే అత‌డు ఇప్ప‌టికే ఆడియెన్ ని ఎంత‌గా ప్ర‌భావితం చేయ‌గ‌లిగాడో అర్థం చేసుకోవ‌చ్చు. నిజానికి కేకే మీన‌న్ న‌టించిన స్పెష‌ల్ ఓపిఎస్ వంటి స్పై వెబ్ సిరీస్ లు చాలా ప్ర‌భావితం చేసాయి. యూత్ లో అత‌డు ఒక న‌ట‌నా ఐకాన్ లా మెరిసిపోయాడు. ఇంకా అత‌డి వెండితెర, ఓటీటీ సిరీస్ ల‌తో చాలా అద్భుతాలు చేసి చూపించాడు. అందుకే ఫ్యాన్స్ ఇలాంటి ప్ర‌తిభావంతుడైన స్టార్ ప్ర‌భావ‌వంత‌మైన సినిమాల‌లో మ‌ళ్లీ మ‌ళ్లీ క‌నిపించాల‌ని ఆశిస్తున్నారు. ఇదంతా కేకే మీన‌న్ సాధించుకున్న అభిమానం.

అయితే ఒక ప్రాంతీయ సినిమాను విశ్లేషిస్తే... ఈ స్థాయి పెర్ఫామ‌ర్లు ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ లో ఉన్నారా? ఒక అభిమాని ఫ‌లానా న‌టుడు మాకు కావాలి. ఫ‌లానా సినిమాలో లేదా సిరీస్ లో ఈ న‌టుడు ఉంటే బావుంటుంది అని కోరుకున్న వైనం మీరు గ‌మ‌నించారా? రావుగోపాల్రావు, కోట శ్రీ‌నివాస‌రావు, బాబు మోహ‌న్ లేదా ఏవీఎస్, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం, బ్ర‌హ్మానందం, అలీ.. ఇలా కొద్దిమంది త‌మ‌కంటూ ఒక బ్రాండ్ సృష్టించుకుని వారి సీజ‌న్ లో ఏలారు. అయితే నేటిత‌రంలో కూడా ప్ర‌తిభావంతుల‌కు కొద‌వేమీ లేదు. కానీ వారికి ప్ర‌మోష‌న్ చాలా త‌క్కువ‌. జెన్ జీకి బ్రాండ్ బిల్డింగ్ చాలా అవ‌స‌రం. అలాంటి స‌హాయ న‌టీన‌టుల‌ను మ‌న‌ నెటిజనం గుర్తించి పెద్ద‌గా ప్ర‌మోట్ చేస్తే ప్రాంతీయంగానే కాకుండా, జాతీయ స్థాయిలో వారికి మంచి అవ‌కాశాలొస్తాయేమో!! రెడ్డిట్, ఎక్స్, ఇన్ స్టా లేదా ఇంకా ఏవైనా డిజిట‌ల్ వేదిక‌ల‌పై మ‌న జెన్ జెడ్ స్టార్ల‌లో ప్ర‌తిభావంతుల‌కు స‌రైన ప్ర‌చారం క‌ల్పించే ఫ్యానిజం మ‌రింత అవ‌స‌రం.

Tags:    

Similar News