ఒకవైపు కోర్టు సమన్లు.. మరోవైపు చిన్నారి ఫ్యాన్‌పై అల్లు అర్జున్ మనసు!

ఒక వైపు సంథ్య థియేట‌ర్ కేసులో కోర్టుకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు అల్లు అర్జున్. కోర్టు స‌మ‌న్లు అంద‌డంతో అత‌డు ఈనెల 22న విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. మ‌రోవైపు ఐకాన్ స్టార్ త‌న మంచి మ‌న‌సును చాటుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం లేదు.

Update: 2026-06-19 18:53 GMT

ఒక వైపు సంథ్య థియేట‌ర్ కేసులో కోర్టుకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు అల్లు అర్జున్. కోర్టు స‌మ‌న్లు అంద‌డంతో అత‌డు ఈనెల 22న విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. మ‌రోవైపు ఐకాన్ స్టార్ త‌న మంచి మ‌న‌సును చాటుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం లేదు. అత‌డు ఈరోజు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నారిని ప‌ల‌క‌రించి.. పూర్తిగా కోలుకున్నాక‌ త‌న‌ను హైద‌రాబాద్ లో క‌లిసేందుకు రావాల్సిందిగా కోరారు. ఒక ఎన్జీవో చిన్నారిని బ‌న్నికి ప‌రిచ‌యం చేసింది.

బ‌న్ని తన దాతృత్వాన్ని, మంచి మనసును చాటుకోవ‌డానికి ఎప్పుడూ వెన‌కాడ‌రు. ఈసారి కూడా చిన్నారి అనారోగ్యం గురించి తెలుసుకుని క‌ల‌త చెందారు. అదే స‌మ‌యంలో సంథ్య థియేట‌ర్ కేసు విష‌యంలోను ఆయ‌న ఎంతో డిగ్నిఫైడ్ గా వ్య‌వ‌హ‌రించ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా.. అన్నిటికీ అతీతంగా చట్టాన్ని గౌరవిస్తూ అల్లు అర్జున్ క‌చ్చితంగా కోర్టు ముందు హాజరవుతారని ..ఈ కేసులోని ప్రతి దశలోనూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా.. తనను ప్రాణంగా అభిమానించే ఒక చిన్నారి కోసం అల్లు అర్జున్ ప్రత్యేక సమయాన్ని కేటాయించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది.

వారి క‌ల‌ల్ని నిజం చేస్తూ.. టాలీవుడ్ స్టార్ హీరోల మానవత్వం:

తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలు కేవలం వెండితెరపైనే కాకుండా... నిజ జీవితంలోనూ తమకున్న పెద్ద మనసును చాటుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టాలీవుడ్‌లో పలువురు హీరోలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి అభిమానులను ఆప్యాయంగా పలకరించి, వారి ముఖాల్లో నవ్వులు పూయించారు. మరికొన్ని అరుదైన‌ సందర్భాలలో.. ప్రాణాంతక వ్యాధులతో మరణానికి చేరువగా ఉన్న చిన్నారుల చివరి కోరికలను మన్నించి... వారితో ఆత్మీయంగా కొంత సమయం గడిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. తమ అభిమాన హీరోని కలవడమే పరమావధిగా భావించే ఆ చిన్నారుల జీవితాల్లో, ఈ స్టార్స్ చూపించే కాస్త ప్రేమ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.

ఇలాంటి మానవీయ కోణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు గతంలో పలుమార్లు తమ మంచి మనసును చాటుకున్నారు. ఆసుపత్రులలో మంచానికే పరిమితమైన చిన్నారులను ప్రత్యేకంగా కలిసి.. వారితో ముచ్చటించి... వారి కళ్లలో ఎనలేని ఆనందాన్ని నింపారు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోలు) ద్వారా తమకు తెలిసిన ఇలాంటి బాధాకరమైన విషయాలపై తక్షణమే స్పందిస్తూ.. ఆ చిన్నారుల కలలను మ‌న స్టార్లు నిజం చేస్తున్నారు. కేవలం నటులుగానే కాకుండా సమాజం విష‌య‌లో బాధ్యత కలిగిన వ్యక్తులుగా మ‌న‌ స్టార్ హీరోలు చేస్తున్న ఇటువంటి పనులు అభిమానుల గుండెల్లో వారి స్థానాన్ని మరింత ప‌దిల‌ప‌రుస్తున్నాయి. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రాకా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News