'వీర జయధీర'.. గోపీచంద్ 'భరత వర్ష'పై అంచనాలు పెంచేలా..
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ లీడ్ రోల్ లో నేషనల్ అవార్డ్ విన్నర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ మూవీ భరత వర్ష - సాగా ఆఫ్ శూలపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ లీడ్ రోల్ లో నేషనల్ అవార్డ్ విన్నర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ మూవీ భరత వర్ష - సాగా ఆఫ్ శూలపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ పోస్టర్,్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా విడుదలైన తొలి సింగిల్ వీర జయధీర ఆ అంచనాలను మరింత పెంచుతోంది.
ఒంటరి యోధుడి పోరాటాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒకప్పటి ఇండియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ కథలో ఒక యోధుడు భారీ సైన్యాన్ని ఎదుర్కొనే అడ్వెంచర్ స్టోరీ చూపించబోతున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు విడుదలైన ఆ సాంగ్ సినిమా స్టోరీలోని ఎమోషన్స్ ను, యోధుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను స్ట్రాంగ్ గా చూపించింది.
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ ఆ పాటకు గ్రాండ్ ట్యూన్ అందించారు. భారీ ఆర్కెస్ట్రా, పవర్ ఫుల్ బీట్స్, ఎమోషన్స్ కు దగ్గరగా ఉండే సంగీతంతో పాటకు స్పెషల్ రేంజ్ ను తీసుకొచ్చారు. యోధుడి ప్రయాణం వెనుక ఉన్న గొప్పతనాన్ని మ్యూజిక్ ద్వారా ప్రేక్షకులకు చేరవేయడంలో ఆయన సక్సెస్ అయ్యారని సినీ ప్రియులు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు.
ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ రాసిన సాహిత్యం పాటకు ప్రధాన బలంగా నిలిచింది. ఒంటరిగా పోరాడే యోధుడు ధైర్యం, త్యాగం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను పదాల్లో స్ట్రాంగ్ చూపించారు. పాటలోని ప్రతి లైన్ హీరో పర్సనాలిటీ మరింత ఎలివేట్ చేసేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన, అఖిల్ చంద్ర తమ గాత్రంతో పాటకు మరింత పవర్ ను అందించారు.
ముఖ్యంగా పాటలోని హై ఎనర్జీ మూమెంట్స్‌లో వారి గాత్రం యోధుడి భావాలు హై రేంజ్ లో వ్యక్తపరిచింది. అందుకే ఆ సాంగ్ ను వారియర్ ఆంథమ్ గా అభివర్ణిస్తున్నారు సినీ ప్రియులు. విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంచుతో కప్పుకున్న పర్వత ప్రాంతాల్లో గోపీచంద్ యోధుడి పాత్రలో కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో లైఫ్ జర్నీ చేస్తున్న యోధుడి ప్రయాణాన్ని చూపించిన దృశ్యాలు సినిమా స్కేల్ ను చూపించాయి. గోపీచంద్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు పూర్తి న్యాయం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంకల్ప్ రెడ్డి విజన్ కూడా సాంగ్ లో క్లియర్ గా కనిపిస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ను, పాత్రలోని సోల్ ను, యుద్ధ వీరుడి మనస్తత్వాన్ని సాంగ్ ద్వారా మేకర్స్ క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశారు.
ఏదేమైనా వీర జయ ధీర సాంగ్ భరత వర్ష మ్యూజిక్ జర్నీకి మంచి ఆరంభంగా నిలిచింది. సినిమా రేంజ్, కథలోని ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కు ఆ పాట పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఆ పాన్ ఇండియా చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, తొలి పాటతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచగలిగింది.