నార్నే నితిన్ మరొకటి.. ఈసారి పోస్టర్ తోనే హైప్ పెంచేలా..
యంగ్ హీరో నార్నే నితిన్ తన కెరీర్ లో మరో ఆసక్తికరమైన ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలతో ముందుకొచ్చిన ఆయన, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్ ను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
యంగ్ హీరో నార్నే నితిన్ తన కెరీర్ లో మరో ఆసక్తికరమైన ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలతో ముందుకొచ్చిన ఆయన, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్ ను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తన ఆరో చిత్రాన్ని కోల్ మైన్ నేపథ్యంలో సాగే సర్వైవల్ యాక్షన్ డ్రామాగా ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు.
నార్నే నితిన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన #NN6 అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. పోస్టర్ చూస్తేనే ఇది నార్మల్ కమర్షియల్ మూవీ కాదనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. భూగర్భ బొగ్గు గనిలో వందలాది మంది కార్మికుల మధ్య నిలబడి ఉన్న నార్నే నితిన్ లుక్.. ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. చుట్టూ అందరూ ఒకేలా కనిపిస్తున్నా, ఆయన ఫేస్ లో కనిపిస్తున్న ఇంటెన్సిటీ, ఏదో పెద్ద ప్రమాదాన్ని ముందుగానే గుర్తించినట్లున్న ఎమోషన్ కథపై ఆసక్తిని పెంచుతోంది.
ఆ సినిమాలో నార్నే నితిన్ ఓ బొగ్గు గని కార్మికుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గనిలో సంభవించే భారీ విపత్తు నుంచి బయటపడేందుకు పోరాడే వ్యక్తి కథగా ఆ సినిమా రూపొందనున్నట్టు సమాచారం. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు కోల్ మైన్ సర్వైవల్ డ్రామాలు చాలా అరుదుగా వచ్చిన నేపథ్యంలో ఆ స్టోరీ లైన్.. కొత్త ఎక్స్పీరియన్స్ ను అందించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం యంగ్ హీరోలు భారీ మాస్ యాక్షన్ సినిమాల వైపు అడుగులు వేస్తున్న సమయంలో, నార్నే నితిన్ మాత్రం కథకు ప్రాధాన్యం ఉన్న కొత్త జోనర్ ను ఎంచుకోవడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. తన ఇమేజ్ కు సరిపోయే విధంగా యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను మిక్స్ చేసే కథను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సర్వైవల్ డ్రామాల్లో కథనం, టెన్షన్, ఎమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి బ్యాక్ డ్రాప్ లో ఆ చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఇప్పటికే మొదలైంది.
ఆ సినిమాతో దర్శకుడిగా యు సుహాస్ బాబు పరిచయం అవుతున్నారు. కొత్త దర్శకుడైనా కథపై నమ్మకంతోనే నిర్మాతలు ముందుకు వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్ పై బొమ్మక్ శివ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్ లో కనిపిస్తున్న నేచురల్ విజువల్స్, రియలిస్టిక్ ట్రీట్మెంట్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుదని క్లియర్ గా తెలుస్తోంది.
ఇటీవల నార్నే నితిన్ నటించిన సినిమాలు వరుస విజయాలు సాధించడంతో ఆయన కెరీర్ మంచి ఊపులో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వస్తున్న ప్రతి కొత్త ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కేవీఎన్ ప్రొడక్షన్స్ లో ఆయన ఐదో సినిమా అనౌన్స్ చేయగా.. ఇప్పుడు ఆరో మూవీ అనౌన్స్మెంట్ కూడా రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఏదేమైనా #NN6 అనౌన్స్మెంట్ పోస్టర్ కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే అయినప్పటికీ.. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అయితే గనిలో ఎలాంటి ప్రమాదం జరుగుతుంది? ఆ విపత్తు నుంచి హీరో ఎలా బయటపడతాడు? పోరాటంలో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయి? వంటి ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. స్టోరీ, కాన్సెప్ట్ పరంగా ఫ్రెష్ నెస్ కనిపిస్తున్న ఆ చిత్రం నార్నే నితిన్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిలుస్తుందేమో వేచి చూడాలి.